సీఎం వైఎస్‌ జగన్‌తో పవన్‌కు పోలికే లేదు : పోసాని

27 Sep, 2021 19:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పవన్‌ కల్యాణ్‌ తన ప్రశ్నలకు తనే సమాధానాలు చెప్పుకుంటారని సీనియర్‌ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి విమర్శించారు. రెండు రోజుల క్రితం సాయి ధరమ్‌ తేజ్‌ ‘రిపబ్లిక్‌’ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై పోసాని స్పందించారు. ఈ మేరకు హైదరాబాద్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోసాని మాట్లాడుతూ.. పవన్‌ ప్రశ్నించడంలో తప్పేం లేదని, ఆధారాలు చూపి పవన్‌ ప్రశ్నిస్తే బాగుండేదని హితవు పలికారు.
చదవండి: మహేశ్‌ కామెంట్స్‌పై స్పందించిన సాయి పల్లవి

పవన్‌ మాట్లాడిన బాష సరిగా లేదన్నారు. చిరంజీవి నోటి నుంచి అమర్యాద పదాలు ఎప్పుడైనా వచ్చాయా అని ప్రశ్నించారు. చిరంజీవితో రాజకీయంగా అభిప్రాయ బేధాలున్న ఆయనకు వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడలేదని తెలిపారు. రిపబ్లిక్‌ సినిమా ఫంక్షన్‌లో సీఎం, మంత్రులను తిట్టడం ఏంటని పోసాని నిలదీశారు. పవన్‌ కల్యాణ్‌ రెండు నియోజక వర్గాల్లో ఉన్నారు. రెండు చోట్ల  తిరిగారు, ఒక్కచోట అయినా గెలవగలిగారా అని  పోసాని ప్రశ్నించారు. సీఎం వైఎస్‌ జగన్‌తో పోల్చుకునే వ్యక్తిత్వం పవన్‌ కల్యాణ్‌కు లేదని అన్నారు. సీఎం జగన్‌ పనితీరును దేశమంతా గుర్తించిందన్నారు. రెండేళ్లలో పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మార్చేశారని తెలిపారు. సంక్షేమ పథకాలను విజయవంతంగా కొనసాగిస్తున్నారని ప్రశంసించారు.

వైఎస్‌ జగన్‌తో పవన్‌కు పోలికే లేదు
‘పవన్‌ కల్యాణ్‌ ఏంటో సినీ పరిశ్రమకు, ప్రపంచానికి బాగా తెలుసు. జగన్‌తో మీకు పోలికే లేదు. సీఎం జగన్‌కు కులపిచ్చి ఉందని నిరూపించగలరా. అవకాశాల పేరుతో పంజాబ్‌ అమ్మాయిని ఓ వ్యక్తి మోసం చేశాడు. విషయం బయట పెడితే చంపేస్తానని బెదిరించినట్లు తెలిసింది. ఈ విషయం నేనే స్వయంగా విన్నాను. బాధితురాలికి న్యాయ చేయడానికి పవన్‌ ఎందుకు ముందుకు రాలేదు. బాధితురాలికి న్యాయం చేస్తే పవన్‌కు గుడికడతాను. సినిమా పరిశ్రమలో సమస్యలను పవన్‌ పరిష్కరించగలరు.

చంద్రబాబు దళితులను దారుణంగా అవమానించారు
చంద్రబాబుకు కాపుల మీద ప్రేమ ఉందా?. చంద్రబాబు చేసిన అప్పులకు ఈ ప్రభుత్వం అప్పులు కడుతోంది. చంద్రబాబు దళితులను దారుణంగా అవమానించారు. నాయీబ్రహ్మణుల తోకలు కత్తిరిస్తున్నాని హెచ్చరించారు. చంద్రబాబును పవన్‌ ఎందుకు ప్రశ్నించలేదు. ఎక్కడ, ఎప్పుడూ ప్రశ్నించాలో పవన్‌కు తెలీదు. బీజేపీని బూతులు తిట్టి, మళ్లీ ఆ పార్టీతోనే జతకట్టారు. పవన్‌ ప్రజల మనిషీ కాదు. పరిశ్రమ మనిషీ కాదు. ఆయన మాటలకు, చేతలకు పొంతన లేదు. చిరంజీవితో రాజకీయంగా అభిప్రాయ బేధాలున్న ఆయనకు వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడలేదు. సీఎం జగన్‌కు కులపిచ్చి ఉంటే చిరంజీవిని ఎందుకు లంచ్‌కు పిలుస్తారు. దిల్‌రాజుకు ఎందుకు రెడ్డి కులాన్ని పులుముతావు. ఇండస్ట్రీ నన్ను బ్యాన్‌ చేసినా నేను బయపడను.’ అని పోసాని స్పష్టం చేశారు..

మరిన్ని వార్తలు