నేనూ విజయ్‌ మరో సర్‌ప్రైజ్‌ ఇస్తాం

5 Feb, 2021 05:42 IST|Sakshi
హేమల్, రాజ్‌తరుణ్, విజయ్‌కుమార్, అనంత్‌ సాయి, దేవేష్, పూర్ణ

– రాజ్‌తరుణ్‌

‘‘ఒరేయ్‌ బుజ్జిగా’ లాంటి ఎంటర్‌టైనర్‌ తర్వాత మా టీమ్‌ అంతా కలిసి సరికొత్త జోనర్‌లో చేసిన థ్రిల్లర్‌ ‘పవర్‌ ప్లే’. విజయ్‌గారు, నంద్యాల రవిగారు, మధునందన్‌ అద్భుతమైన స్క్రిప్ట్‌ రెడీ చేశారు. నేను, విజయ్‌గారు త్వరలో మరో సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్నాం’’ అన్నారు రాజ్‌ తరుణ్‌. కొండా విజయ్‌ కుమార్‌ దర్శకత్వంలో రాజ్‌ తరుణ్‌ హీరోగా నటించిన చిత్రం ‘పవర్‌ ప్లే’. హేమల్‌ ఇంగ్లే కథానాయిక. పూర్ణ, మధు నందన్, అజయ్‌ ముఖ్య పాత్రల్లో నటించారు. పద్మ సమర్పణలో మహిధర్, దేవేష్‌ నిర్మించిన ఈ సినిమా మార్చి 5న విడుదల కానుంది.

ఈ సందర్భంగా ‘పవర్‌ ప్లే’ ట్రైలర్‌ను మీడియా తరఫున సీనియర్‌ జర్నలిస్ట్, నిర్మాత బి.ఎ.రాజు విడుదలచేశారు. విజయ్‌ కుమార్‌ కొండా మాట్లాడుతూ– ‘‘రాజ్‌ తరుణ్‌ ఇంతవరకూ చేయని ఒక కొత్త జోనర్‌లో ఈ సినిమా చేశాడు. సినిమా ఔట్‌పుట్‌ చాలా బాగా వచ్చింది’’ అన్నారు. ‘‘మేమందరం ఒక ఫ్యామిలీ మెంబర్స్‌లా కలిసి ఈ సినిమా చేశాం’’ అన్నారు దేవేష్‌. ‘‘ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తుంది’’ అన్నారు ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ పలపర్తి అనంత్‌ సాయి. ‘‘ఈ సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా పరిచయమవుతున్నందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు హేమల్‌. ‘‘ఒక వైవిధ్యమైన పాత్రను ఇందులో చేశాను’’ అన్నారు పూర్ణ. ‘‘ఈ సినిమాకి కథ, మాటలు రాశాను’’ అన్నారు నంద్యాల రవి.

మరిన్ని వార్తలు