'శశి' ట్రైలర్‌ విడుదల చేసిన పవన్‌ కల్యాణ్‌

10 Mar, 2021 13:17 IST|Sakshi

హీరో ఆది సాయికుమార్‌, సురభి జంటగా నటించిన సినిమా 'శశి' లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాతో శ్రీనివాస్ నాయుడు దర్శకుడిగా పరిచయం కానున్నాడు. బుధవారం ఈ సినిమా ట్రైలర్‌ను పవన్‌ కల్యాణ్‌ విడుదల చేశారు. 'మనం ప్రేమించే వాళ్ళు మన పక్కన ఉంటే ఎంత ధైర్యంగా ఉంటుందో.. ప్రమాదంలో ఉన్నప్పుడు అంతే భయంగా ఉంటుంది' అని ఆది చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభవుతుంది.

ప్రేమంటే లేని చోట వెతుక్కోవడం కాదు.. ఉన్న చోట నిలబెట్టుకోవడం'  'ప్రేమించిన వాడితో పెళ్లి చేయకుండా.. పెళ్లి చేసిన వాడితో ప్రేమగా ఉంటుందనుకోవడం మీ మూర్ఖత్వం' వంటి సంభాషణలు ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో ఆది లుక్స్‌ కొత్తగా అనిపిస్తుందనడంలో సందేహం లేదు. రాజీవ్‌ కనకాల హీరోయిన్‌ తండ్రి పాత్రలో నటించాడు.  వెన్నెల కిశోర్ , తులసి, జయప్రకాష్, అజయ్,  వైవా హర్ష , సుదర్శన్‌ కీలక పాత్రల్లో కనిపించారు. శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ పతాకంపై  ఆర్.పి. వర్మ, సి. రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇక ఈ చిత్రంలోని 'ఒకే ఒక లోకం నువ్వే' పాట ఇప్పటికే సూపర్‌ హిట్‌ అయిన సంగతి తెలిసిందే. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట యూట్యూబ్‌లో ఇప్పటికే 60 మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూసుకుపోతుంది. చంద్రబోస్ రచించిన ఈ పాట మ్యూజిక్‌ లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. మార్చి 19న ఈ చిత్రం థియేటర్స్‌లో విడుదల కానుంది. ఇక చాన్నాళ్లుగా సరైన హిట్‌ కోసం  ఆదికి 'శశి' ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి. 

చదవండి : (రణ్‌బీర్‌కి కరోనా... క్వారంటైన్‌లో ఆలియా!)
(పవన్‌ కల్యాణ్‌ న్యూలుక్‌.. ఫొటో వైరల్‌)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు