ప్రభాస్‌ పాన్‌ ఇండియా స్టార్‌ అవుతాడని ఊహించలేదు: కృష్ణం రాజు

28 Jun, 2022 16:56 IST|Sakshi

ప్రభాస్‌ తొలి సినిమా(ఈశ్వర్‌) చూశాక తప్పకుండా పెద్ద హీరో అవుతాడని అనుకున్నాం కానీ.. పాన్‌ ఇండియా స్టార్‌ అవుతాడని ఊహించలేదు. అతని పట్టుదల, శ్రమతో పాటు అభిమాలను అండదండలతో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ప్రభాస్‌ని చూస్తుంటే గర్వంగా, ఆనందంగా ఉంది’అని రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు అన్నారు. ప్రభాస్‌ హీరోగా తొలిసారి కెమెరా ముందుకు  వచ్చి సరిగ్గా నేటితో( జూన్‌ 28) 20ఏళ్లు పూర్తయింది. 2002 జూన్‌ 28న రామానాయుడు స్టూడియోలో ప్రభాస్ హీరోగా పరిచయం అవుతూ ఈశ్వర్ అనే సినిమాని మొదలుపెట్టారు.

(చదవండి: అది చెత్త సినిమా.. దానివల్ల ఏడాది పాటు ఆఫర్స్‌ రాలేదు: పూజా హెగ్డే)

ప్రభాస్ హీరోగా అడుగుపెట్టి నేటికీ 20 ఏళ్ళు పూర్తవడంతో అయన అభిమానులు ఈ ఇరవై ఏళ్ల ఆనందాన్ని సంబరంగా జరుపుకున్నారు. ఆలిండియా రెబెల్ స్టార్ కృష్ణం రాజు, ప్రభాస్ ఫాన్స్ అధ్యక్షడు జె ఎస్ ఆర్ శాస్త్రి ( గుంటూరు ) ఆధ్వర్యంలో మంగళవారం రోజు హైద్రాబాద్ లో కృష్ణం రాజు ఇంట్లో ఈ సెలెబ్రేషన్స్ జరిగాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కొందరు అభిమానులతో పాటు ఈశ్వర్ సినిమాను తెరకెక్కించి, ప్రభాస్ ని హీరోగా పరిచయం చేసిన దర్శకుడు జయంత్ సి పరాన్జీ, నిర్మాత అశోక్ కుమార్ లతో పాటు రెబెల్ స్టార్ కృష్ణం రాజు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు.

ఈ సందర్బంగా రెబెల్ స్టార్ కృష్ణం రాజు మాట్లాడుతూ ..  ప్రభాస్ హీరోగా పరిచయం అయి అప్పుడే 20 ఏళ్ళు గడచిపోయాయా అన్న సందేహం కలుగుతుంది . నిజంగా ఆ రోజు ప్రభాస్ ని హీరోగా పరిచయం చేద్దామని ముందు మేమె అనుకున్నాం. మా గోపి కృష్ణ బ్యానర్ లో ప్రభాస్ ని పరిచయం చేయాలనీ అనుకున్న తరువాత ఒకరోజు నిర్మాత అశోక్ కుమార్, దర్శకుడు జయంత్ వచ్చి ప్రభాస్ ని పరిచయం చేసే అవకాశం మాకు ఇవ్వమని అడిగారు.

ఈశ్వర్ కథ చెప్పినప్పుడు బాగా నచ్చింది. మంచి మాస్ ఎలిమెంట్స్ ఉన్న కథ, తప్పకుండా అందరికి బాగా నచ్చుతుందన్న నమ్మకంతో అశోక్ కుమార్ కు ఓకే చెప్పాం. జయంత్, అశోక్ ఇద్దరు కలిసి ఎంతో బాధ్యతగా తీసిన ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుని ప్రభాస్ ని హీరోగా నిలబెట్టింది. ప్రభాస్ మొదటి సినిమా చూసాకా తప్పకుండా పెద్ద హీరో అవుతాడని అనుకున్నాం కానీ ఎవరు ఊహించని విధంగా ఇలా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడంటే అతని శ్రమ, పట్టుదల ముఖ్యంగా మా అభిమానుల అండదండలు ఉన్నాయి. ప్రభాస్ ని చుస్తే చాలా ఆనందంగా ఉంది. ఒక నటుడిగానే కాకుండా సాటివారి పట్ల సహాయం చేసే గొప్ప గుణం ఉంది. ప్రభాస్ ఇంకా ఇలాగే మరింత ఎత్తుకు ఎదగాలని మంచి విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను ’అన్నారు. 

మరిన్ని వార్తలు