ప్రభాస్‌ - నాగ్‌ అశ్విన్‌ సినిమా మొదలయ్యేది అప్పుడే!

28 Apr, 2021 08:07 IST|Sakshi

పాన్‌ ఇండియన్‌ స్టార్‌ ప్రభాస్, ‘మహానటి’ ఫేమ్‌ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ కాంబినేషన్‌లో సినిమా అనగానే ఫ్యాన్స్‌తో పాటు ఇండస్ట్రీలోనూ అంచనాలు పెరిగిపోయాయి. ఎప్పుడెప్పుడు షూటింగ్‌ ఆరంభం అవుతుందా? అని ప్రభాస్‌ అభిమానులు ఎదురు చూస్తున్నారు. నిజానికి ఈ సినిమా తొలి షెడ్యూల్‌ చిత్రీకరణను జూలైలో మొదలు పెట్టాలనుకున్నారు నాగ్‌ అశ్విన్‌.

కానీ ప్రస్తుత కోవిడ్‌ పరిస్థితుల కారణంగా షూట్‌ను అక్టోబర్‌కు వాయిదా వేశారట. ఈలోపు భవిష్యత్‌లో షూటింగ్‌ సజావుగా, వేగంగా సాగేందుకు అవసరమైన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్స్, యాక్షన్‌ సీక్వెన్స్, టెక్నికల్‌ పనులపై నాగ్‌ అశ్విన్‌ మరింత దృష్టి సారించాలనుకుంటున్నారని సమాచారం. ప్రస్తుతం ప్రభాస్‌ ‘రాధేశ్యామ్‌’, ‘ఆదిపురుష్‌’, ‘సలార్‌’ చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

చదవండి: ప్రభాస్‌తో సినిమా.. దాని కోసమే ఎక్కువ సమయం తీసుకుంటున్ననాగ్‌ అశ్విన్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు