రూ. 150 కోట్ల ఆఫర్లు వదులుకున్న ప్రభాస్‌, ఎందుకో తెలుసా?

23 Jun, 2021 16:32 IST|Sakshi

బాహబలి చిత్రాలతో ఒక్కసారిగా పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగాడు ‘డార్లింగ్‌’ ప్రభాస్‌. దీంతో ప్రభాస్‌ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. ఇప్పుడు అదే క్రేజ్‌ను సోమ్ము చేసుకోవాలని చూస్తున్నాయి ప్రముఖ బ్రాండ్‌ కంపెనీలు. ఈ నేపథ్యంలో తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రభాస్‌ను చేసుకోవాలని భావించి పలు కంపెనీలు ఆయనను సంప్రదించగా ప్రభాస్‌ అసక్తి చూపడం లేదట. దీంతో ఆయా కంపెనీలు వెనక్కి తగ్గాయని వినికిడి. ఈ క్రమంలో ప్రభాస్‌ దాదాపు రూ. 150 కోట్లు విలువ చేసే బ్రాండ్స్‌ను వదులుకున్నట్టు వస్తున్న వార్తలు ప్రస్తుతం సోషల్‌ మీడియలో హాట్‌టాపిక్‌గా మారాయి. 

కాగా ప్రభాస్‌ పాన్‌ ఇండియా స్టార్‌ స్టేటస్‌ దృష్ట్యా పలు అగ్ర వ్యాపార సంస్థలు ఆయనను తమ బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా చేసుకోవాలని భావిస్తున్నాయి. ఇందుకోసం భారీ మొత్తంలో పారితోషకం ఆఫర్‌ చేస్తూ ప్రభాస్‌ను సంప్రదించాయట. అయితే ప్రభాస్‌ చేతిలో పలు భారీ ప్రాజెక్ట్స్‌ ఉండటంతో షూటింగ్స్‌తో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. అంతేగాక ప్రేక్షకుల్లో తనకున్న అభిమానం దృష్ట్యా ఏ బ్రాండ్‌ పడితే ఆ బ్రాండ్‌లో నటించకూడదని అనుకున్నాడట. అందుకే ఆయన దగ్గరకు వచ్చిన కొన్ని బ్రాండ్స్‌ను సునయాసంగా తిరస్కరించాడని సన్నిహిత వార్గాల నుంచి సమాచారం. 

ఈ క్రమంలో ప్రభాస్‌ గత ఏడాది సుమారు 150 కోట్ల రూపాయలు విలువ చేసే కాంట్రాక్ట్స్‌ను వదులుకున్నట్లు సమాచారం. దీనితో పాటు బాహుబలి, బాహుబలి-2 సమయంలో షూటింగ్‌ బిజీ కారణంగా ప్రభాస్‌ రూ.10 కోట్లు విలువ చేసే బ్రాండ్‌ ఆఫర్స్‌ను వదులుకున్నట్లు కూడా అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సలార్‌’తో పాటు రాధాకృష్ణకుమార్‌తో ‘రాధేశ్యామ్‌’, ఓం రౌత్‌తో ‘ఆదిపురుష్‌’ సినిమాలు చేస్తున్నాడు. ఈ ప్రాజెక్టులు పూర్తి కాగానే నాగ్‌ అశ్విన్‌తో మరో పాన్‌ మూవీలో నటించనున్నాడు. కాగా ఇప్పటికే రాధేశ్యామ్‌ మూవీ షూటింగ్‌ను పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమవుతుంది.

మరిన్ని వార్తలు