ప్రకాశ్‌ రాజ్‌ మరో ట్వీట్‌.. మళ్లీ మొదలైన రచ్చ

14 Aug, 2021 18:52 IST|Sakshi

విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ చేసే వరుస ట్వీట్‌లు మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ‘మా’ ఎన్నికలను మరింత వేడెక్కిస్తున్నాయి. సెప్టెంబర్‌లో ఈ ఎన్నికలు జరగాల్సిన ఉండగా 3 నెలల ముందే టాలీవుడ్‌లో ఎన్నికల సెగ మొదలైంది. ప్రత్యర్థులు ఒకరిపై ఒకరూ విమర్శలు గుప్పిస్తూ వరుసగా ట్వీట్‌లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల షూటింగ్‌లో గాయపడ్డ ప్రకాశ్‌ రాజ్‌ మెల్లిగా కోలుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇంకా ఆస్పత్రి బెడ్‌పైనే ఉన్న ఆయన తాజాగా ‘జెండా ఎగరేస్తాం’ అంటూ చేసిన ట్వీట్‌ చర్చనీయాంశంగా మారింది. అయితే స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో ఆ ట్వీట్‌ చేశారా.. లేక ఎన్నికల నేపథ్యంలో చేశారా అనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయ్యింది. 

కాగా పది రోజుల క్రితం ప్రకాశ్‌ రాజ్‌ ‘తెగేవరకు లాగొద్దంటూ’ చేసిన ట్వీట్‌ దుమారం రేపిన సంగతి తెలిసిందే. అలాగే మా ఎన్నికలు ఎప్పుడు అంటూ నెల క్రితం ట్వీట్‌ చేశాడు. కాగా తమిళ హీరో ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న ఓ చిత్రంలో ప్రకాశ్ రాజ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఒకవైపు ‘మా’ ఎన్నికల్లో చురుగ్గా ఉంటూనే మరోవైపు షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో ఇటీవల ధనుష్‌ చిత్రం షూటింగ్‌లో ఆయన ప్రమాదానికి గురయ్యాడు. చేతికి బలమైన గాయం కావడంతో మెరుగైన చికిత్స కోసం చెన్నై నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. ఈ క్రమంలో ఆయనకు నిన్న సర్జరీ జరిగింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నట్లు శుక్రవారం ట్వీట్‌ చేశాడు.

మరిన్ని వార్తలు