లండన్‌ రెస్టారెంట్‌లో ప్రియాంక రచ్చ, వీడియో వైరల్‌

14 Aug, 2021 15:04 IST|Sakshi

గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక ప్రస్తుతం లండన్‌లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. వీకెండ్‌ సందర్భంగా ఆమె స్నేహితులతో కలిసి డిన్నర్‌ డేట్‌కు వెళ్లిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం హల్‌చల్‌ చేస్తున్నాయి. నటి సండ్రా హో, ఆక్వాఫినా, డైరెక్టర్‌ పాల్‌ ఫీగ్‌లతో కలిసి ప్రియాంక రెస్టారెంట్‌కు వెళ్లినట్లు తెలుస్తుంది. అక్కడ ప్రియాంకను చూసిన ఆమె ఫ్యాన్‌ ఒకరు గప్‌చుప్‌గా వీడియో తీశాడు. ఆ తర్వాత ఈ వీడియోను ప్రియాంక ట్వీటర్‌ ఫ్యాన్స్‌ పేజీలో షేర్‌ చేయడంతో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియో ప్రియాంక అల్లరి మామూలుగా లేదు. 

ప్రియాంక పాట పాడుతూ, డ్యాన్స్‌ చేస్తూ రచ్చ రచ్చ చేస్తుంటే పక్కనే అక్వాఫినా, సండ్రా హో, డైరెక్టర్‌ పాల్‌ ఫీగ్‌లు ఎంజాయ్‌ చేస్తూ కనిపించారు. ఇలా తమ అభిమాన నటిని చూసి ఆమె ఫ్యాన్స్‌ తెగ మురిసిపోతుంటే మరికొందరి ‘ప్రియాంక అల్లరి మామూలుగా లేదు కదా’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా ప్రియాంక తన భర్త నిక్‌జోనస్‌, తల్లి మధు చోప్రాతో కలిసి లండన్‌లోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన ఫొటోలు ఇటీవల బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేగాక అక్కడి రోడ్లపై భర్త నిక్‌జోనస్‌తో కలిసి లండన్‌ వీధుల్లో ప్రియాంక చిల్‌ అవుతున్న ఫొటోలు సైతం ఈ మధ్య తరచూ దర్శనమిస్తున్నాయి. కాగ నిక్‌ జోనస్‌ను వివాహం చేసుకున్న తర్వాత ప్రియాంక ఆమెరికాకు మాకాం మార్చేసిందే. హాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ నటిగా ఫుల్‌ బిజీ అయిపోయింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు