రాధే పైరసీ.. వాట్సాప్‌ కట్‌!

25 May, 2021 08:06 IST|Sakshi

న్యూఢిల్లీ: సినిమా పైరసీ విషయంలో ఢిల్లీ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. సినిమాను పైరసీని ప్రొత్సహించే యూజర్ల వాట్సాప్‌ అకౌంట్లను తాత్కాలికంగా రద్దు చేయాలని  సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌కు సూచించింది. రాధే సినిమా పైరసీ కాపీలను షేర్‌ చేసినవాళ్లతో పాటు చూసిన వాళ్ల, అమ్మిన వాళ్ల వాట్సాప్‌, ఇతరత్రా సోషల్‌ మీడియా అకౌంటన్లను సస్పెండ్‌ చేయాలని సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఒక సినిమా విషయంలో న్యాయస్థానం ఈ తరహా ఆదేశాలు జారీ చేయడం ఇదే మొదటిసారి.

ఇప్పటికే రాధే పైరసీ పై మహారాష్ట్రలో క్రిమినల్‌ కంప్లంయిట్స్‌ కూడా నమోదు అయ్యింది. కాగా, తమ సినిమా పైరసీ యధేచ్ఛగా జరుగుతోందని, సినిమా క్లిపులు వాట్సాప్‌ గ్రూపుల్లో పెద్ద ఎత్తున్న సర్క్యులేట్‌ అవుతున్నాయని రాధే సినిమా హక్కులదారు జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ఇంటీరియమ్‌ రిలీఫ్‌ కింద ఈ ఆదేశాలను జారీ చేసింది జస్టిస్‌ సంజీవ్‌ ఆధ్వర్యంలోని సింగిల్‌ జడ్జ్‌ బెంచ్‌. ఈ విషయంలో తమ సబ్‌స్క్రయిబర్ల వివరాలివ్వాలని టెలికామ్‌ ఆపరేటర్లను సైతం కోర్టు ఆదేశించింది. ఆ తర్వాతే క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని పోలీసులకు తెలిపింది.  పైరసీ  కాపీలను చూడడం, కాపీ, అమ్మకం, నిల్వ చేయడం.. ఇలా ఏ రూపంలో రాధే పైరసీ కాపీ ఉన్నా సరే చర్యలు తీసుకోవాల్సిందేనని తెలిపింది. డిజిటల్‌ కంటెంట్‌ విషయంలో కఠిన నిబంధనలు అమలు రాబోతున్న వేళ.. పైరసీపై ఇలాంటి చర్యలు మునుముందు నిర్మాతలకు ఊరట అందించబోతున్నాయి.

 

కాగా, సల్మాన్‌ ఖాన్‌ హీరోగా నటించిన ‘రాధే: యువర్‌ మోస్ట్‌వాంటెడ్‌ భాయ్‌’ మే 13న జీ ఫ్లిక్స్‌లో , డిష్‌, డీ2హెచ్‌, టాటా స్కై, ఎయిర్‌టెల్‌ డిజిటల్‌ టీవీ లాంటి డీటీహెచ్‌ వేదికల్లో ‘పే పర్‌ వ్యూ’ విధానంలో రిలీజ్‌ చేశారు. వ్యూయర్‌షిప్‌తో దుమ్మురేపినప్పటికీ.. కంటెంట్‌ ఆడియెన్స్‌ను మెప్పించకపోవడం, నెగెటివ్‌ రివ్యూలు, ట్రోలింగ్‌తో.. 1.8 ఐఎండీబీ రేటింగ్‌తో సల్మాన్‌ కెరీర్‌లోనే వరెస్ట్‌ మూవీ ట్యాగ్‌ దక్కించుకుంది రాధే.

మరిన్ని వార్తలు