రజనీ మూవీపై కొత్త రూమర్స్‌.. నమ్మొదంటున్న చిత్ర బృందం

23 Apr, 2021 15:09 IST|Sakshi

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా, శివ దర్శకత్వంలో రూపొందుతున్న తాజాగా చిత్రం ‘అన్నాత్తే’. కొద్ది రోజుల క్రితం రజనీకాంత్‌ అనారోగ్యానికి గురికావడంతో ఈ సినిమా షూటింగ్‌ నిలిచిపోయింది. అయితే ఇటీవల రజనీ పూర్తిగా కోలుకోవడంతో తిరిగి షూటింగ్‌ మొదలైంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతంది. అయితే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం రాత్రిపూట కర్ప్యూ విధించింది. దీంతో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అత్యవసర సేవలు మినహా ఎలాంటి కార్యక్రమాలు చేసే వీల్లేకుండా అయిపోయింది.

ఈ నేపథ్యంలో రజనీకాంత్‌ సినిమా షూటింగ్‌ కూడా నిలిచిపోయిందని, విడుదల తేది కూడా మారబోతున్నట్లు పుకార్లు వచ్చాయి. కానీ అవి ఒట్టి పుకార్లే అని చిత్ర యూనిట్‌ కొట్టిపారేసింది. తమ సినిమాను అనుకున్నట్లే దీపావళి సందర్భంగా నవంబర్‌ 4న విడుదల చేస్తామని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. కర్ప్యూ సమయంలో కూడా షూటింగ్‌ జరుపుకునేలా తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్‌ పోలీసుల నుంచి చిత్ర యూనిట్‌ ప్రత్యేకంగా అనుమతి తీసుకున్నట్లు సమాచారం. సినిమా చిత్రీకరణ కొవిడ్‌ నిబంధనల ప్రకారం షూటింగ్‌ జరుపుకోనుంది. మరో 15 రోజుల పాటు హైదరాబాద్‌లోషూటింగ్‌ చేసుకొని చెన్నై వెళ్తామని చిత్ర యూనిట్‌ క్లారిటీ ఇచ్చింది.
చదవండి:
హీరోయిన్‌ లవ్‌ ఎఫైర్‌.. అడ్డొచ్చిన తమ్ముడిని ముక్కలుగా నరికి..
ఓటీటీలో దృశ్యం-2.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత సురేశ్‌బాబు

మరిన్ని వార్తలు