Jailer Box Office Collection Day 2: బాక్సాఫీస్ షేక్ చేస్తోన్న జైలర్‌.. రెండు రోజుల్లోనే వందకోట్ల మార్క్!

12 Aug, 2023 17:57 IST|Sakshi

సూపర్‌ స్టార్ రజినీకాంత్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటించిన చిత్రం జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం.. ఈనెల 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది. మొదటి రోజే పాజిటివ్‌ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన రోజే రూ.52 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. రెండు రోజు సైతం అదే ఊపులో దూసుకెళ్తోంది.

(ఇది చదవండి: మొన్న సెలవులు.. ఇప్పుడేమో ఏకంగా జైలర్ స్పెషల్ షోలు..!)

జైలర్ రెండు రోజుల్లోనే రూ.100 కోట్లను దాటేసిందని సినీ ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ప్రపంచవ్యాప్తంగా వంద కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తలైవాకు దక్షిణాదిలో భారీగా అభిమానులు ఉన్నారు. అంతే కాకుండా రజినీకాంత్‌ సినిమాలకు విదేశాల్లోనూ క్రేజ్ అదేస్థాయిలో ఉంది. దీంతో ఈజీగా రూ.100 కోట్ల మార్కును అధిగమించింది జైలర్. వీకెండ్స్‌లో మరిన్ని రికార్డులు బద్దలు కావడం ఖాయంగా కనిపిస్తోంది.

రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు తిరగరాస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.  కాగా.. ఈ చిత్రంలో సునీల్, రమ్యకృష్ణ, మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. కాగా..  ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతమందించారు. 

(ఇది చదవండి: స్టార్ హీరో కుమార్తె చేసిన పనికి నెటిజన్స్ ప్రశంసలు! )


 

మరిన్ని వార్తలు