పీపీఈ కిట్‌ ధరించి.. కూరగాయలు కొనడానికి వచ్చిన నటి

24 Apr, 2021 15:36 IST|Sakshi

వైరలవుతోన్న రాఖీ సావంత్‌ వీడియో

కరోనా సెకండ్‌ వేవ్‌ దారుణంగా ఉంది. కేసుల సంఖ్య ప్రతి రోజు పెరుగుతూనే ఉన్నాయి. ప్రజలంతా మాస్క్‌ ధరించి.. సామాజిక దూరం పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచే నటి రాఖీ సావంత్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఓ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. రాజకీయ నాయకులకంటే మీరు వంద రేట్లు మేలు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజనులు. రాఖీపై ఇంతలా ప్రశంసలు కురవడానికి కారణం ఏంటో తెలియాలంటే ఇది చదవాల్సిందే..

తాజాగా రాఖీ సావంత్‌ కూరగాయలు కొనడానికి సమీప మార్కెట్‌కి వెళ్లారు. అసలే కరోనా విజృంభిస్తోంది. పైగా సెలబ్రిటీ బయట కనిపించింది అంటే చాలు.. జనాలు ఎలా గుమిగూడతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని రాఖీ సావంత్‌ ఓ వినూత్న ఆలోచన చేశారు. జనాలు తనను గుర్తు పట్టకుండా ఉండటం కోసమే కాక.. కరోనా నుంచి కాపాడుకోవడం కోసం పీపీఈ కిట్‌ ధరించి మార్కెట్‌ వెళ్లారు రాఖీ సావంత్‌.

చేతులకు గ్లౌవుజులు.. ఒంటి మీద పీపీఈ కిట్‌ ధరించిన రాఖీ సావంత్‌.. ఓ కూరగాయల బండి దగ్గరకు వెళ్లి బేరమాడి.. మంచి ధర చెల్లించి మరి కూరగాయలు కొన్నారు. ఈ సమయంలో సదరు కూరగాయలమ్మే వ్యక్తిని మాస్క్‌ సరిగా ధరించమని సూచించారు. ఇక ఆమె షాపింగ్‌ అయిపోయిన తర్వాత రాఖీ ఒక్కసారిగా అరిచారు. ‘‘ఇన్ని కూరగాయలకు కేవలం మూడు వందల రూపాయలు మాత్రమేనా.. నా జీవితంలో ఇన్ని ఎక్కువ ఐట్సెం ఇంత తక్కువ ధరకు ఎప్పుడు కొనలేదు’’ అంటూ సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. 

ఇందుకు సంబంధించిన వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు రాఖీ సావంత్‌. అంతేకాక బయటకు వెళ్లినప్పడు పీపీఈ కిట్‌ ధరించి వెళ్లడం చాలా మంచిది అంటూ అభిమానులకు సూచించారు. ఈ వీడియో ప్రసుత్తం తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజనులు మాటలు చెప్పే రాజకీయ నాయకుల కన్నా మీరు చాలా బెటర్‌.. మాటలు చెప్పడం కాదు.. చేతల్లో చూపించారు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజనులు.

చదవండి: నిన్ను నువ్వే పెళ్లి చేసుకుంటున్నావా?
 

A post shared by Rakhi Sawant (@rakhisawant2511)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు