చలం భావజాలంతో...

17 Nov, 2020 06:08 IST|Sakshi

పలు రచనలు చేయడంతో పాటు, అనేక డాక్యుమెంటరీలు తీసిన కిరణ్మయి ఇంద్రగంటి దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘రాళ్ళలో నీరు’. కృష్ణ మంజూష, అల్తాఫ్, షఫీ, బిందు చంద్రమౌళి, డా. ప్రసాద్‌ ముఖ్య పాత్రల్లో ఈ చిత్రాన్ని అనల్ప నిర్మించారు. ‘‘తెలుగులో ‘కన్యాశుల్కం’లా ఇంగ్లిషులో ‘ఏ డాల్స్‌ హౌస్‌’ ఫేమస్‌. 19వ శతాబ్దానికి చెందిన రచయిత హెన్రిక్‌ ఇబ్సన్‌ ఈ నాటకం రాశారు. చలం తరహాలో ప్రోగ్రెసివ్‌ థాట్స్‌ (ప్రగతిశీల ఆలోచనలు)తో ఉండే ఈ నాటకం థీమ్‌ని తీసుకుని వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా స్క్రిప్ట్‌ సిద్ధం చేశాను. ఇందులో ఐదు పాత్రలే ఉంటాయి. సినిమా విడుదలకు రెడీగా ఉంది. ఇటీవలే లాస్‌ఏంజిల్స్‌లో ‘అవేర్నెస్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’లో ప్రదర్శించగా మంచి స్పందన వచ్చింది’’ అన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా