వైరల్‌: చరణ్‌ ఇంటి ముందు ఫ్యాన్స్‌ హంగామా..

26 Mar, 2021 19:49 IST|Sakshi

మార్చి 17.. మెగాపవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ పుట్టినరోజు.. తాము ఎంతగానే ఆరాధించే హీరో పుట్టిన రోజును ఘనంగా నిర్వహించేందుకు అభిమానులు ఫుల్‌ హడావిడి చేస్తున్నారు. రెండు, మూడు రోజుల ముందు నుంచే వేడుకలు మెదలు పెట్టేశారు. ఇప్పటికే  సోషల్‌ మీడియాలో హ్యపీ బర్త్‌డే రామ్‌ చరణ్‌ అంటూ రచ్చలేపుతున్నారు. ఇటు ట్విటర్‌లోనూ రామ్‌చరణ్‌ పేరుతో ఓ హ్యష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌లో నిలిచింది. కేకులు, కటౌట్లకు పాలాభిషేకాలతో బర్త్‌డే నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

మరోవైపు చరణ్‌ పుట్టిన రోజుకు ఒక రోజు ముందుగానే(శుక్రవారం) హీరోను కలుసుకునేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తన నివాసం ముందు సందడి చేస్తున్నారు. వీరిని కలిసేందుకు చరణ్‌ కూడా ఇంటి ముదుకు వచ్చాడు. ఇంటి ముందున్న గేట్‌ మీద నుంచి అభిమానులతో ముచ్చటించారు. ఈ క్రమంలో అభిమానుల కోరిక మేరకు మీసం తిప్పాడు చరణ్. అనంతరం ఆర్ఆర్ఆర్ మూవీ గురించి మాట్లాడుతూ.. శుక్రవారం సాయంత్రం మోషన్ పోస్టర్ రిలీజ్ కాబోతుందని చెప్పుకోచ్చాడు. అలాగే మార్చి 28న పవర్ స్టార్ వకీల్ సాబ్ పోస్టర్ తానే విడుదల చేయబోతున్నట్లు వెల్లడించాడు. అనంతరం కొంతమంది ఫ్యాన్స్‌కు చరణ్‌ షేక్‌ హ్యాండ్‌ ఇచ్చాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. 


ఇదిలా ఉండగా రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా 'ఆర్ఆర్ఆర్' చిత్ర బృందం బిగ్‌ సర్‌ప్రైజింగ్ అందించింది. 'ఆర్ఆర్ఆర్'లో చరణ్ పోషిస్తున్న సీతారామరాజు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామారాజు పాత్ర ఎంత పవర్ ఫుల్‌గా ఉంటుందో తాజగా రిలీజ్ చేసిన పోస్టర్ ద్వారా అర్థమవుతోంది. 'ఆర్ఆర్ఆర్' నుంచి చరణ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన కొద్ది సేపట్లోనే అభిమానులతోపాటు, సెలబ్రిటీలనూ సైతం ఎంతగానో ఆకట్టుంటూ ట్రెండ్ అవుతోంది.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: ఆర్‌ఆర్‌ఆర్‌ : రామ్‌చరణ్‌ ఫ్యాన్స్‌కి గిఫ్టిచ్చిన రాజమౌళి

చరణ్‌కు ఇల్లు కట్టిన ఫ్యాన్‌‌.. స్వయంగా కలిసిన హీరో..

మరిన్ని వార్తలు