Upasana: జూనియర్‌ చెర్రీని ఎప్పుడు చూపిస్తారన్న ప్రశ్నకు ఉపాసన జవాబిదే!

11 Nov, 2021 20:46 IST|Sakshi

Ram Charan- Upasana Kamineni: టాలీవుడ్‌లో క్యూట్‌ కపుల్‌గా పేరొందారు రామ్‌చరణ్‌-ఉపాసన. వీరి పెళ్లై ఎనిమిదేళ్లవుతున్నా ఇప్పటివరకు పిల్లలను ప్లాన్‌ చేసుకోలేదు. ఆమె ఎక్కడికి వెళ్లినా జూనియర్‌ రామ్‌చరణ్‌ను గానీ, జూనియర్‌ ఉపాసనను గానీ ఎప్పుడు చూపిస్తారు? అన్న ప్రశ్న ఎదురవడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో తాజాగా సాక్షి టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చిన ఉపాసన ఈ విషయంపై స్పందించింది. అది తన వ్యక్తిగత విషయమని తెలిపింది.

దీని గురించి చాలామంది అడుగుతూనే ఉన్నారు కానీ దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ఉపాసన అభిప్రాయపడింది. దీని గురించి ఏం ఆన్సర్‌ ఇచ్చినా అది సెన్సేషనే అవుతుందని, అది తనకిష్టం లేదని పేర్కొంది. ఎవరేమనుకున్నా ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్పాలనుకున్నప్పుడే చెప్తాను అని తేల్చి చెప్పింది. ఇక చెర్రీ చేసిన సినిమాల్లో రంగస్థలం, చిరంజీవి నటించినవాటిలో సై'రా సరసింహారెడ్డి' తనకు బాగా ఇష్టమని చెప్పుకొచ్చింది.

మరిన్ని వార్తలు