Kashmir Criminals: పూర్తిగా కాశ్మీర్‌లో తీసిన తొలి తెలుగు చిత్రం.. ట్రైలర్ రిలీజ్‌

14 Jun, 2022 19:48 IST|Sakshi

Ram Gopal Varma Launched Kashmir Criminals Trailer: నాగప్రసాద్-శివన్య జంటగా నటించిన చిత్రం "కాశ్మీర్ క్రిమినల్స్". అంజని క్రియేషన్స్-ఆరేటి క్రియేషన్స్-వడ్లపట్ల క్రియేషన్స్ పతాకాలపై... "రావణ లంక" ఫేమ్ బి.ఎన్.ఎస్. దర్శకత్వంలో జి.ఎ. రామారావు-హర్ష ఆరేటి-మోహన్ వడ్లపట్ల (యు.ఎస్.ఎ) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. షూటింగ్ మొత్తం కాశ్మీర్‌లో జరుపుకున్న మొట్టమొదటి తెలుగు చిత్రం కావడం విశేషం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు దాదాపు తుది దశలో ఉన్నాయి. 

తాజాగా ఈ మూవీ ​​ట్రైలర్‌ను సంచనాల డైరెక్టర్‌ రామ్‌గోపాల్ వర్మ విడుదల చేశారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని చిత్రబృందానికి ఆల్‌ ది బెస్ట్‌ తెలిపారు. తమ చిత్రం ట్రైలర్ రిలీజ్ చేసిన రాంగోపాల్ వర్మకు నిర్మాతలు కృతజ్ఞతలు తెలిపారు. షూటింగ్ మొత్తం కాశ్మీర్ లో జరుపుకున్న ఈ చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. 

చదవండి: హైదరాబాద్‌ ఆస్పత్రిలో చేరిన దీపికా పదుకొణె..
కొడుకు ఫొటోను షేర్‌ చేసిన కాజల్‌.. ఈసారి ముఖం కనిపించేలా

మరిన్ని వార్తలు