ఇది కనులు కల గన సాధ్యమా...

24 Jan, 2024 01:59 IST|Sakshi
హెబ్బా పటేల్, చైతన్యా రావు

‘నిజమా.. ఇది కనులు కల గన సాధ్యమా..’ అంటూ ప్రేమ పాట పాడుకున్నారు చైతన్యా రావు, హెబ్బా పటేల్‌. ఈ ఇద్దరూ జంటగా నటించిన ‘హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌’ చిత్రంలోని పాట ఇది. ఎన్‌ఆర్‌ఐ ఎంటర్టైన్మెంట్స్‌ (యుఎస్‌ఎ) సమర్పణలో న్యూ రీల్‌ ఇండియా ఎంటర్టైన్మెంట్స్‌పై  కేకేఆర్, బాలరాజ్‌ నిర్మించారు.

బాల రాజశేఖరుని దర్శకుడు. ఈ చిత్ర సంగీతదర్శకుడు కల్యాణీ మాలిక్‌ స్వరపరచి, సునీతతో కలిసి పాడినన ‘నిజమా...’ పాటను దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ విడుదల చేశారు. ఈ సందర్భంగా రామ్‌గోపాల్‌ వర్మ మాట్లాడుతూ– ‘‘నిజమా..’ పాట చాలా మెలోడియస్‌గా ఉంది.

లొకేషన్స్‌ బాగున్నాయి. కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ చిత్రం మంచి విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘రామ్‌గోపాల్‌ వర్మగారితో ‘బ్యూటీ ఆఫ్‌ ఫ్యాషన్, ఆట’ అనే రెండు హాలీవుడ్‌ చిత్రాలకు పనిచేశాను. నేను దర్శకుడు కావడానికి ‘శివ’ చిత్రం స్ఫూర్తి.  త్వరలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు బాల రాజశేఖరుని.

>
మరిన్ని వార్తలు