1940 బ్యాక్‌డ్రాప్‌తో రానా సంచలన చిత్రం

7 Apr, 2021 01:12 IST|Sakshi

70 ఏళ్లు వెనక్కి వెళ్లనున్నారు రానా. వైవిధ్యమైన పాత్రలను చేయడానికి ఇష్టపడే ఈ హీరో 1940 బ్యాక్‌డ్రాప్‌ స్టోరీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట. ఇంతకీ ఈ కథ ఎవరు చెప్పారంటే వెంకీ. ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ శిష్యుడు వెంకీ. 1940 నాటి నేపథ్యంలో వెంకీ ఓ కథ సిద్ధం చేశారట. ఈ స్టోరీని ఇటీవల రానాకు వినిపించారని సమాచారం. రానాకు నచ్చడంతో వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని టాక్‌.

14 రీల్స్‌ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుందని, త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుందని టాక్‌. ఇదిలా ఉంటే... ప్రస్తుతం మలయాళ మూవీ ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ తెలుగు రీమేక్‌లో నటిస్తున్నారు రానా. వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా నటించిన ‘విరాట పర్వం’ ఈ నెల 30న విడుదల కానుంది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు