రణబీర్ ఫేవరెట్ హీరోయిన్ ఆమెనట.. ఆలియా భట్‌ కాదండోయ్‌!

27 Jun, 2022 19:50 IST|Sakshi

బాలీవుడ్‌లో ఇటీవల పెళ్లి చేసుకున్న క్యూట్ కపుల్ ఎవరంటే రణబీర్ కపూర్ ఆలియా భట్‌. ఈ జంట కొంత కాలం రిలేషన్‌షిప్‌లో ఉండి ఇటీవలే వివాహం కూడా చేసుకున్నారు. చివరగా ఈ చాక్లెట్‌ బాయ్‌ ‘సంజు’ సినిమాలో కనిపించాడు. ఆ తర్వాత పలు కారణాల వల్ల దాదాపు నాలుగేళ్లు ప్రేక్షకులకు దూరంగా ఉన్నాడు. ఆ గ్యాప్‌ని పూరించడానికి 'షంషేరా', 'బ్రహ్మాస్త్ర' వరుస చిత్రాలతో తన అభిమానులకు ముందుకు రాబోతున్నాడు. వీటిలో ‘షంషేరా’ చిత్రం జూలై 22న థియేటర్లలో విడుదల కానుంది. 

ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌తో పాటు రణ్‌బీర్‌ కూడా మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా గడుపుతున్నారు. ఇటీవల ఓ చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు రణ్‌బీర్‌. అందులో యాంకర్‌ అడిగిన ప్రశ్నకు షాకింగ్‌ రిప్లై ఇచ్చాడు ఈ చాక్లెట్‌ బాయ్‌. 

ఏంటా ప్రశ్నంటే?
రణ్‌బీర్‌ని తన ఫేవరెట్‌ కో-స్టార్‌గా ఎవరని అడగగా సౌరభ్ శుక్లా పేరును చెప్పాడు. అతనితో గతంలో బర్ఫీ (2012), జగ్గా జాసూస్ (2017), త్వరలో విడుదల కానున్న ‘షంషేరా’ చిత్రంలో కలిసి నటించారు. ఇక రణ్‌బీర్‌కి ఇష్టమైన నటి ఎవరన్న ప్రశ్నకు బదులుగా.. అనుష్క శర్మ పేరుని చెప్పాడు. వీరిద్దరూ గతంలో.. ఏ దిల్ హై ముష్కిల్ (2016), బాంబే వెల్వెట్ (2015), సంజు (2018) చిత్రాలలో కలిసి నటించారు.

 అయితే అనుష్క తనకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అని, ఇద్దరూ ఎప్పుడూ గొడవపడుతూ ఉంటారని తెలిపాడు. అంతే కాకుండా ఇద్దరం క్రియేటివిటి విషయంలో ఒకేలా ఆలోచిస్తారని కూడా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అనుష్క చక్దా 'ఎక్స్‌ప్రెస్‌లో నటిస్తోంది. ఇందులో ఆమె భారత మాజీ క్రికెటర్ ఝులన్ గోస్వామిగా నటిస్తుంది. నాలుగేళ్ల తర్వాత ఆమె మళ్లీ తెరపై కనిపించనుంది.

చదవండి: Allu Arjun: బన్నీ షాకింగ్‌ లుక్‌ వైరల్‌, దారుణంగా ట్రోల్‌ చేస్తున్న నార్త్‌ నెటిజన్లు

మరిన్ని వార్తలు