‘నాన్నా నవ్వుతోంది.. నేను కట్టలేను’

26 Jul, 2020 16:40 IST|Sakshi

హీరో నితిన్‌ మరి కొద్ది గంటల్లో తన ప్రేయసి షాలిని కందుకూరి మెడలో మూడు మూళ్లు వేయనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నితిన్‌ తాజా చిత్రం రంగ్‌దే టీమ్‌ ప్రత్యేక బహుమతి ఇవ్వనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు చిత్ర బృందం.. ఆదివారం సాయంత్రం రంగ్‌దే టీజర్‌ను విడుదల చేసింది. నితిన్‌కు వివాహ శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ టీజర్‌పై స్పందించిన.. ఈరోజు మరింత స్పెషల్‌గా చేసినందుకు రంగ్‌దే టీమ్‌కు థ్యాంక్స్‌ చెప్పారు. కాగా, ఈ చిత్రంలో నితిన్‌ సరసన కీర్తీ సురేశ్‌ కథానాయికగా నటిస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.(మెహందీలో మెరిసిన షాలిని-నితిన్‌)

ఈ టీజర్‌లో నితిన్‌ తన తండ్రి నిర్ణయం మేరకు కీర్తి సురేష్‌ను పెళ్లి చేసుకున్నట్టు, పెళ్లి తర్వాత ఇంటి పనులు చేయడంతో బిజీ అయినట్టు చూపించారు. ఇందులో ‘అది నా గర్ల్‌ ఫ్రెండ్‌ కాదు’,  ‘చేయి తీయ్‌ జస్టిస్‌ చౌదరి’, ‘నాన్న నవ్వుతుంది.. నేను కట్టలేను’ అంటూ నితిన్‌ చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి. మరోవైపు వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు వస్తుందని భావిస్తున్నట్టు చిత్ర బృందం పేర్కొంది. (పెళ్లి సందడి షురూ)

మరోవైపు నితిన్‌-షాలిని పెళ్లి వేడుకకు అంతా సిద్ధమైంది. ఈ రోజు రాత్రి 8.30 గంటలకు వీరిద్దరు వివాహ బంధంతో ఒకటి కానున్నారు. నగరంలోని తాజ్‌ ఫలక్‌నుమాలో ఈ వేడుక జరగనుంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇరు కుటుంబాలతో పాటుగా, అతికొద్ది మంది సన్నితులు, అతిథులు ఈ పెళ్లి వేడుకకు హాజరు కానున్నారు.

మరిన్ని వార్తలు