Karan Johar Birthday Party: కరణ్‌ జోహార్‌ బర్త్‌డే పార్టీ, ఒకే రంగు దుస్తుల్లో మెరిసిన రష్మిక, విజయ్‌

26 May, 2022 16:33 IST|Sakshi

బాలీవుడ్‌ నిర్మాత కరణ్‌ జోహార్‌ బుధవారం(మే 25న) 50వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన సెలబ్రిటీలకు గ్రాండ్‌ పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ వేడుకకు బాలీవుడ్‌కు చెందిన స్టార్‌ హీరోహీరోయన్లు షారుక్‌ ఖాన్‌ కుటుంబంతో హాజరు కాగా.. కొత్త జంటలు కత్రీనా కైఫ్‌, విక్కీ కౌశల్‌, రణ్‌బీర్‌-ఆలియా భట్‌లు సందడి చేశారు. 

చదవండి: పార్టీ టైమ్‌: ప్రియురాలితో హృతిక్‌, ప్రియుడితో హీరో మాజీ భార్య

అలాగే కృతిక్‌ రోషన్‌, ఆమిర్‌ ఖాన్‌, గౌరీ ఖాన్‌ తదితరులు హజరు కాగా.. దక్షిణాది నుంచి పూరీ జగన్నాథ్‌, చార్మీ కౌర్‌, విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, తమన్నాలు హాజరయ్యారు. ఈ పార్టీలో రష్మిక బ్లాక్‌ డ్రెస్‌లో మెరిసిపోయింది. ఈ పార్టీలో రష్మిక బ్లాక్‌ డ్రెస్‌లో అక్కడి రెడ్‌ కార్పెట్‌పై హోయలు పోతూ నడుస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో రష్మిక స్టన్నింగ్‌ లుక్‌కు ఆమె ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. అలాగే ఈ పార్టీలో విజయ్‌ సైతం బ్లాక్‌డ్రెస్‌లో రాగా తమన్నా పింక్‌ కలర్‌ సూట్‌లో దర్శనమచ్చింది.

చదవండి: విడాకుల తర్వాత కలిసి పార్టీకెళ్లిన మాజీ దంపతులు

కాగా మొదట కన్నడ చిత్రం కిరిక్‌ పార్టీతో సినీరంగ ప్రవేశం చేసిన ఆమె ‘ఛలో’ మూవీతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత గీతా గోవిందం, భీష్మ, డియర్‌ కామ్రెడ్‌, పష్ప వంటి చిత్రాలతో సక్సెస్‌ అందుకుంది. తక్కవ కాలంలోనే టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన రష్మికకు ఆ వెంటనే హిందీలో ఆఫర్‌ వచ్చింది. ఇప్పటికే హిందీలో రెండు సినిమాలు చేసిన ఆమె రణ్‌బీర్‌ కపూర్‌ సరసన ఎనియమల్‌లో నటిస్తోంది. అలాగే తెలుగులో అల్లు అర్జున్‌ ‘పుష్ప 2’ మూవీతో పాటు తమిళ హీరో విజయ్‌తో ఓ సినిమ చేస్తున్న సంగతి తెలిసిందే. 

A post shared by Gossip Girl💋👑 (@bolly_newzz)

మరిన్ని వార్తలు