‘మిడ్‌నైట్‌ రన్నర్స్‌’ గా రెజీనా, నివేదా థామస్‌

27 Jul, 2021 10:35 IST|Sakshi

సౌత్‌ కొరియన్‌ హిట్‌ ఫిల్మ్‌ ‘మిడ్‌నైట్‌ రన్నర్స్‌’ (2017) తెలుగులో రీమేక్‌ అవుతోంది. సుధీర్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రెజీనా, నివేదా థామస్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. డి. సురేశ్‌బాబు, సునీత తాటి, హ్యూన్యూ థామస్‌ కిమ్‌లు ‘మిడ్‌నైట్‌ రన్నర్స్‌’ తెలుగు రీమేక్‌ను నిర్మిస్తున్నారు.

‘‘ఈ ఏడాది మార్చిలో ఈ సినిమా షూటింగ్‌ మొదలైంది. ప్రస్తుతం ఫైనల్‌ షెడ్యూల్‌ చిత్రీకరణ జరుగుతోంది. ఆగస్టు కల్లా పూర్తి చేయాలనుకుంటున్నాం. ఈ సినిమా కోసం రెజీనా, నివేదా థామస్‌ తొలిసారిగా డిఫరెంట్‌ స్టంట్స్‌ చేస్తున్నారు’’ అని చిత్రయూనిట్‌ వెల్లడించింది. ఇద్దరు కాబోయే పోలీసాఫీసర్లు కిడ్నాపర్ల ముఠాను ఎలా పట్టుకున్నారన్నదే ‘మిడ్‌నైట్‌ రన్నర్స్‌’ కథాంశం.

మరిన్ని వార్తలు