బేబీ బంప్‌తో 'సాహో' నటి.. సోషల్ మీడియాలో వైరల్

17 Jan, 2023 15:37 IST|Sakshi

బాలీవుడ్ నటి, యే జవానీ హై దివానీ ఫేమ్ ఎవెలిన్ శర్మ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్పింది. తాను రెండోసారి తల్లిని కాబోతున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ సందర్భంగా బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలను షేర్ చేసింది ముద్దుగుమ్మ. ఈ వార్త విన్న పలువురు బాలీవుడ్ సెలబ్రీటీలు శుభాకాంక్షలు చెబుతున్నారు. 

ఎవెలిన్ శర్మ మే 2021లో బాయ్‌ఫ్రెండ్ తుషాన్ భిండిని పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఫ్రెండ్ అయిన మరో నటి ఫంక్షన్‌లో తొలిసారి కలుసుకున్నారు. గతంలో నవంబర్ 12, 2021న ఈ జంటకు కుమార్తె జన్మించింది. పాపకు అవ రానియా భిండి అని పేరు పెట్టారు.

 బాలీవుడ్ కెరీర్: ఎవెలిన్ శర్మ 2012లో 'ఫ్రం సిడ్నీ విత్ లవ్' సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.  ఆ తర్వాత 'నౌతంకీ సాలా', 'వైజేహెచ్‌డీ', 'యారియాన్', 'మెయిన్ తేరా హీరో', 'కుచ్ కుచ్ లోచా హై', 'హిందీ మీడియం' వంటి చిత్రాలలో నటించింది. 2019లో ప్రభాస్, శ్రద్ధా కపూర్ నటించిన 'సాహో' సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. 

A post shared by Evelyn Sharma (@evelyn_sharma)

మరిన్ని వార్తలు