12 ఏళ్ల తర్వాత సాయిరామ్ శంకర్‌కు మళ్లీ ‘బంపర్ ఆఫర్’

6 Mar, 2021 21:31 IST|Sakshi

పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరామ్ శంకర్ హీరోగా నటించిన 'బంపర్ ఆఫర్' సినిమా ఎంత ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. సాయిరామ్‌ శంకర్‌ కెరీర్‌లోనే అది బిగ్గెస్ట్‌ హిట్‌. ఇప్పుడు ఆయనే హీరోగా అదే పేరును కొనసాగిస్తూ ‘బంపర్ ఆఫర్ – 2’ పేరుతో ఓ చిత్రం రాబోతుంది. ఈ చిత్రం రాయలసీమ నేపథ్యంలో సాగుంది. 

‘బంపర్ ఆఫర్’  విడుదలైన 12 సంవత్సరాల తర్వాత అదే పేరు మీద రెండవ భాగం చేస్తున్నారు. అయితే ఇది సీక్వెల్ కాదు, రాయలసీమ ప్రాంతం నేపథ్యంలో అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రూపొందించబోతున్నారు. ‘బంపర్ ఆఫర్’ చిత్రానికి దర్శకత్వం వహించిన జయ రవీంద్ర ఈ రెండో భాగాని కి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సురేశ్ యల్లంరాజుతో కలిసి సాయిరామ్ శంకర్ నిర్మిస్తుండటం విశేషం.  అశోక స్క్రిప్ట్ అందించాడు. 

ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఉగాది శుభాకాంక్షలతో ఏప్రిల్ నెలలో ప్రారంభం అవుతుంది.  హీరోయిన్‌తో పాటు ఇతర నటీనటుల వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని నిర్మాత సురేష్ యల్లంరాజు వెల్లడించారు. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తుండగా పప్పు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించబోతున్నారు. 

చదవండి: చీరలో వయ్యారాలు ఒలకబోస్తున్న కాజల్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు