ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌: సల్మాన్‌కు అరుదైన గౌరవం

27 Feb, 2021 08:56 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌కు పెయింటింగ్‌ అంటే ఆసక్తి అన్న సంగతి తెలిసిందే. ఇంట్లో ఖాళీ సమయం దొరికనప్పుల్లా తన పెయింట్‌ బ్రష్‌కు పని చేప్తుంటాడు భాయిజాన్‌. అలా లాక్‌డౌన్‌లో ఆయన వేసిన కొన్ని పెయింటింగ్స్‌ను సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. ఈ క్రమంలో సల్మాన్‌కు ఓ అరుదైన గౌరవం దక్కనుంది. త్వరలో బెంగళూరులో జరిగే ఓ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌లో సల్మాన్‌ పెయింటింగ్‌లను ప్రదర్శించనున్నారు. అది కూడా ప్రముఖ భారత చిత్రకారుడైన రాజా రవి వర్మ పెయింటింగ్‌ చిత్రాలతో పాటు ఆయన‌ పెయింటింగ్‌ను కూడా ప్రదర్శించనున్నారు. దీనిపై భాయిజాన్‌ ఆనందం వ్యక్తం చేస్తూ ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో శుక్రవారం పంచుకున్నాడు.

‘రాజా రవి వర్మ, అబనీంద్రనాథ్‌ ఠాగూర్‌, వీఎస్‌ గైతోండే వంటి గొప్ప కళాకారుల మధ్య నా పెయింటింగ్‌ ప్రదర్శించబోతుండటం నిజంగా విశేషం. ఈ విషయాన్ని గ్రహించడం కాస్తా ఇబ్బందిగా ఉంది. నిజంగా ఇది అరుదైన గౌరవం. అందరికి ధన్యవాదాలు’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. సల్మాన్‌ సంతకం చేసిన మదర్‌ థెరిస్సా పెయింటింగ్‌ను ఈ ఇమ్మోర్టల్‌ పెయింటింగ్‌ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించనున్నారు. కాగా సల్మాన్‌ హీరోగా ప్రభుదేవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాధే’ మూవీ షూటింగ్‌ పూర్తి చేసుకుని ఈ ఏడాది రంజాన్‌కు విడుదలకు సిద్దంగా ఉంది. ఇందులో సల్మాన్‌కు జోడిగా దిశా పటాని నటిస్తుంది. ‘రాధే’తో పాటు మనీష్ శర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ‘టైగర్ 3’, ‘కబీ ఈద్ కబీ’ సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. 

A post shared by Salman Khan (@beingsalmankhan)

చదవండి: షారుక్‌ ఖాన్‌ సినిమాలో సల్మాన్‌! 
     హీరో సల్మాన్‌ఖాన్‌ గుర్రం పేరిట మోసం

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు