నావి దొంగిలించవద్దు: నటుడికి సమంత సూచన

27 May, 2021 08:09 IST|Sakshi

సమంత, మనోజ్‌ భాజ్‌పాయ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌ సిరీస్‌ "ద ఫ్యామిలీ మ్యాన్‌ 2". ట్రైలర్‌ రిలీజ్‌ అయిననాటి నుంచి ఈ సిరీస్‌ మీద నీలినీడలు కమ్ముకున్నాయి. దీన్ని నిషేధించాలంటూ తమిళనాడు ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. సమంత పాత్రపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మరోవైపు ఫ్యామిలీ మ్యాన్‌ యూనిట్‌ మాత్రం ప్రమోషన్లలో బిజీబిజీగా ఉన్నారు.

ఈ సందర్భంగా నటుడు మనోజ్‌ భాజ్‌పాయ్‌ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంతను ఆకాశానికెత్తాడు. 'చెన్నైలో షూటింగ్‌ కోసం అడుగుపెట్టే సమయానికి సమంత అన్ని రకాలుగా రెడీ అయి ఉన్నారు. మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకుని, ఫిజికల్‌గానూ ట్రైన్‌ అయి ఉన్నారు. అప్పుడు నాకు కొద్దిగా భయమేసింది. ఆమె సిద్ధంగా ఉన్నారు. నేనింకా ఏమీ మొదలుపెట్టనే లేదు అని! మళ్లీ నేను రిహార్సల్స్‌ చేయాల్సి ఉంటుందేమోనని అనుకున్నా' అని మనోజ్‌ చెప్పుకొచ్చాడు.

దీనిపై సమంత స్పందిస్తూ.. 'ఓ మై గాడ్‌.. అవన్నీ నామాటలే. వాటిని మీరు దొంగిలిస్తున్నారు. మీరు గొప్ప నటులు. ఫ్యామిలీ మ్యాన్‌ 2 సీజన్‌లో మీరు ఎంత అద్భుతంగా నటించారనేది ప్రేక్షకులు చూసి తీరాల్సిందే. ఆ క్షణం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను' అని సమంత ట్వీట్‌ చేసింది. రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో ప్రియమణి, షరీబ్‌ హష్మి, శరద్‌ కేల్కర్‌, శ్రేయా ధన్వంతరి ముఖ్య పాత్రలు పోషించారు. ఇది జూన్‌ 4 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ప్రసారం కానుంది.

చదవండి: The Family Man 2: వాళ్లను చంపేస్తానంటోన్న సామ్‌

మరిన్ని వార్తలు