పలు బాషల్లో సమంత డబ్బింగ్‌

5 Dec, 2020 19:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హీరోయిన్‌ సమంత.. అక్కినేని వారి కోడలు అయ్యాక మరింత గ్లామర్‌తో సినిమాల్లో నటిస్తున్నారు. టాలీవుడ్‌లో అగ్రనటిగా రాణిస్తూనే ఇటీవల వస్రా వ్యాపారంలోకి అడుగుపెట్టారు సమంత. తాజాగా ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ వెబ్‌‌ సిరీస్‌ సీజన్‌ 2లో సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోస్‌లో రూపొందిస్తున్న ఈ వెబ్‌ సిరీస్‌లో సమంత నెగిటివ్‌ రోడ్‌ చేస్తున్నారు. అయితే ఈ సిరీస్‌ భారత్‌లో పలు భాషలలో నిర్మిస్తున్నందు ఆయా బాషల్లో సమంత తన పాత్రలకు స్వయంగా డబ్బింగ్‌ చెప్పుకుంటున్నట్లు సమాచారం. అయితే సినిమాల్లో సమంతకు ప్రముఖ గాయని చిన్మయి డబ్బింగ్‌ చెప్తున్న విషయం తెలిసిందే. సమంత తన అందం, అభినయంతో ఎంతమంది అభిమానులను సంపాదించారో.. సినిమాల్లోని తన వాయిస్‌తో కూడా అంతేమంది అభిమానులు సంపాదించారు. (చదవండి: బబుల్‌ బాత్‌.. స్నేహితురాలికి షాకిచ్చిన సామ్‌)

అయితే అది తన రియల్‌ వాయిస్‌ కాదని తెలిసి చాలామంది అభిమానులు నిరాశ చెందారు. అయినప్పటిక ఆ వాయిస్‌ సమంతకు కరెక్ట్‌గా సరిపోవడంతో అభిమానులంత సర్లేనంటూ సరిపెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో సమంత నటిస్తున్న వెబ్‌ సిరీస్‌లో తన పాత్రలకు డబ్బంగ్‌ చెప్పకుంటుందన్న ఈ వార్త ఆమె అభిమానులకు నిజంగా శుభవార్తేనని చెప్పుకొవచ్చు. అయితే ఈ వెబ్‌సిరీస్‌ ఇప్పటికే అమెజాన్‌లో స్ట్రీమింగ్‌ అవ్వాల్సి ఉంది కానీ వీఎఫ్‌ఎక్స్‌ పనులు పూర్తికాకపోవడంతో వచ్చే నెలకు విడుదల వాయిదా వేశారంట. ఇక ఈ సిరీస్‌లో సమంత తన వాయిస్‌తో ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకుంటారో వేచి చూడాల్సిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా