చాలెంజ్‌గా తీసుకుని చేశాను

7 Nov, 2020 00:18 IST|Sakshi
సమంత, అల్లు అరవింద్, నందినీ రెడ్డి

–సమంత

‘‘సామ్‌జామ్‌ షో నాకు చాలా పెద్ద చాలెంజ్‌. దీంతో పోల్చుకుంటే సినిమా యాక్టింగ్‌ చాలా సులభం అనిపిస్తోంది. ఇలాంటి సమయంలో ఈ షో చేయటం ముఖ్యమనిపించింది. అందుకే చాలెంజ్‌గా తీసుకుని ఈ షో చేశాను’’ అన్నారు సమంత. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ‘ఆహా’లో ‘సామ్‌జామ్‌’ అనే షోతో ఈ నెల 13నుండి ప్రేక్షకుల ముందుకు రానున్నారు సమంత. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమంత మాట్లాడుతూ– ‘‘సామ్‌జామ్‌ టాక్‌ షో కాదు. ఈ షోలో సమాజంలోని సమస్యల గురించి మాట్లాడతాం.

టాలెంట్‌ను ఎంకరేజ్‌ చేస్తాం. నేను బిగ్‌బాస్‌ షోకు హోస్ట్‌గా చేయటం నాగ్‌మామ నిర్ణయం. ఆ షో చేసే టైమ్‌లో పెద్దగా నిద్ర పట్టలేదు. చాలా హార్డ్‌వర్క్‌ చేశాను’’ అన్నారు. అల్లు అరవింద్‌ మాట్లాడుతూ– ‘‘ఆహా’ను ఫిబ్రవరిలో లాంచ్‌ చేశాం. ఈ ప్లాట్‌ఫామ్‌ని నెక్ట్స్‌ లెవల్‌కు తీసుకెళ్లడానికి సమంతగారితో ఓ పెద్ద షో చేయాలనుకున్నాం. ఇది నార్మల్‌ షో కాదు. నందినీరెడ్డి ఈ షోను తన భుజాలపై మోస్తున్నారు’’ అన్నారు. నందినీరెడ్డి మాట్లాడుతూ– ‘‘కాఫీ విత్‌ కరణ్‌’, ‘కౌన్‌బనేగా కరోడ్‌పతి’ షోలు చేసిన టీమ్‌తో పని చేయటం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నాను’’ అన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు