Drohi Movie Review: ద్రోహి సినిమా రివ్యూ

3 Nov, 2023 21:47 IST|Sakshi
Rating:  

టైటిల్‌: ద్రోహి
నటీన‌టులు: సందీప్ బొడ్డపాటి, దీప్తి వర్మ, షకలక శంకర్, మజిలీ శివ, మహేష్ విట్ట, డెబ్బి.
దర్శకుడు: విజయ్ దాస్ పెందుర్తి
సంగీతం : అనంత నారాయణ ఏ. జి
నిర్మాణం: ప్లే వరల్డ్ క్రియేషన్స్, సాఫిరస్ ప్రొడక్షన్స్ ప్రొడక్షన్స్, గుడ్ ఫెల్లోస్ మీడియా సంయుక్తంగా.
నిర్మాతలు: రాజశేఖర్ రవి పూడి, శ్రీకాంత్ రెడ్డి దుగ్గెంపూడి
విడుద‌ల తేదీ: 3 న‌వంబ‌ర్, 2023

క‌థేంటంటే..
హీరో సందీప్ (అజయ్) ఒక బిజినెస్‌మెన్‌. తన ఇద్దరి స్నేహితులతో కలిసి బిజినెస్ చేస్తూ ఉంటాడు. కానీ త‌న‌కు వ్యాపారం అస్స‌లు క‌లిసి రాదు. చేసే ప్రతి బిజినెస్ ఫెయిల్ అవుతూనే ఉంటుంది. వ్యాపారంలో న‌ష్ట‌పోతున్న‌ప్ప‌టికీ తన భార్య హీరోయిన్ దీప్తి వర్మ (చంద్రిక) అత‌డికి సపోర్టుగా ఉంటుంది. రెండేళ్లుగా సక్సెస్ లేక‌పోవడం వ‌ల్ల‌ అజయ్ ఫుల్ ప్రెషర్‌లో ఉంటాడు. అలా సాగిపోతున్న తన జీవితంలో అనుకోని సంఘటన జరిగి చంద్రిక చనిపోతుంది. దీప్తి హ‌త్య‌ కేసులో తనని సస్పెక్ట్ గా అరెస్టు చేస్తారు. ఆ కేసు నుంచి హీరో ఎలా బయట పడ్డాడు? అనేది ఈ సినిమా కథ.

విశ్లేషణ
దర్శకుడు కథను ఎంచుకున్న తీరు, స్క్రీన్ ప్లే చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. షకలక శంకర్‌లో ఒక కొత్త నటుడిని చూపించారు. ఈ సినిమాలో ఒక లీడ్ రోల్ చేసిన హీరోయిన్ డెబ్బి ఇంతకుముందు చేసిన పాత్ర‌కు భిన్నంగా సాఫ్ట్ క్యారెక్టర్‌లో కనిపించారు. సంగీతం ప‌ర్వాలేదు. హీరో సందీప్ యాక్టింగ్ బాగుంది. హీరో ఫ్రెండ్స్‌గా మహేశ్ విట్టా, నీరోజ్ పుచ్చ పాత్ర‌లు ఆకట్టుకున్నాయి.

చిన్న సినిమా అయినా ఎక్కడా కాంప్రమైజ్ అవ‌కుండా తీశారు. షకలక శంకర్ పాత్ర‌, నటన అద్భుతంగా ఉన్నాయి. హీరో సందీప్‌కు ఇది తొలి చిత్ర‌మే అయిన‌ప్ప‌టికీ అనుభ‌వం ఉన్న‌ట్లుగా న‌టించాడు. మహేష్ విట్ట నటన చాలా బావుంది. చాందిని, మజిలీ శివ, దీప్తి వర్మ ఎవరి పాత్ర‌ల‌కు వారు న్యాయం చేశారు. అయితే క‌థ‌లో కొత్త‌ద‌నం లేక‌పోవ‌డంతో బోరింగ్‌గా అనిపిస్తుంది.

చ‌ద‌వండి: తెలుగింటి కోడ‌లు కాబోతున్న సీతారామం హీరోయిన్‌.. ఇదిగో క్లారిటీ!

Rating:  
(2.5/5)
మరిన్ని వార్తలు