ఆకట్టుకుంటున్న సడక్‌ 2 ట్రైలర్‌

12 Aug, 2020 11:43 IST|Sakshi

ముం‍బై : సంజయ్‌ దత్‌ ప్రధాన పాత్రలో ఆదిత్యారాయ్‌ కపూర్‌, ఆలియా భట్‌ హీరో, హీరోయిన్లుగా మహేశ్‌ భట్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సడక్‌ 2 ట్రైలర్‌ వచ్చేసింది. 1991లో మహేష్‌ భట్‌ దర్శకత్వంలో వచ్చిన హిట్‌ మూవీ సడక్‌కు ఇది సీక్వెల్‌ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోసారి రవివర్మ పాత్రలో నటిస్తున్న సంజయ్‌ తన భార్య(పూజా భట్‌) చనిపోవడంతో ట్యాక్సీ డ్రైవర్‌ వృత్తిని మానేసి ప్రశాంత జీవితం గడుపుతుంటాడు. దేవుడి పేరుతో ప్రజలను మభ్యపెడుతన్న నకిలీ బాబా గుట్టును బయటపెట్టడానికి ఆలియా ప్రయత్నిస్తుంటుంది. సంజయ్‌, ఆదిత్యారాయ్‌ కపూర్‌ల సహకారంతో నకిలీ బాబా గుట్టును ఆమె ఎలా బహిర్గతం చేస్తుందనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. (ఓటీటీలో సడక్‌ 2)

నకిలీ బాబా పాత్రలో మకర్‌ దేశ్‌ పాండే, గుల్షన్‌ గ్రోవర్, జిష్ణు సేన్‌ గుప్తా తదితరులు‌ నటిస్తున్నారు. విశేష్‌ ఫిలింస్‌ బ్యానర్‌ పేరు మీద ముఖేశ్‌ భట్‌ నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ చిత్రంతో 21 ఏళ్ల తర్వాత మహేశ్‌ భట్‌ మళ్లీ దర్శకత్వ బాధ్యతలు చేపట్టాడు.తండ్రి మహేష్‌ భట్‌ దర్శకత్వంలో తొలిసారి ఆలియా నటించిన చిత్రమిది. కరోనా నేపథ్యంలో థియేటర్లు మూతపడటం, ఎప్పుడు తిరిగి ప్రారంభిస్తారనే విషయంపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు యూనిట్‌ మొగ్గుచూపింది. ఈ సినిమాను డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో ఈనెల 28న విడుదల కానుంది. కాగా సంజయ్‌ దత్‌ మంగళవారం నానావతి ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్న తర్వాత ఊపిరితిత్తుల క్యాన్సర్‌ బారీన పడినట్లు సమాచారం. సంజయ్‌ చికిత్స కోసం అమెరికాకు వెళ్లనున్నట్లు తెలిసింది.('సంజయ్‌.. ఆ నొప్పి ఎలా ఉంటుందో తెలుసు')

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు