మ‌హేశ్ బ‌ర్త్‌డే కానుక అదిరిపోయింది

9 Aug, 2020 11:37 IST|Sakshi

సూప‌ర్ స్టార్ మ‌హే‌శ్ బాబు నేడు 45వ వ‌సంతంలోకి అడుగు పెట్టారు. ఈ సంద‌ర్భంగా 'స‌ర్కారు వారి పాట' చిత్రబృందం ఆదివారం ఉద‌యం 9 గంట‌ల 9 నిమిషాల‌కు మోష‌న్ పోస్ట‌ర్ రిలీజ్ చేస్తూ అభిమానుల‌కు మ్యూజిక‌ల్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చింది. స‌ర్కారు వారి పాట అంటూ సాగుతూ బ్యాక్‌గ్రౌండ్‌లో వ‌చ్చే సంగీతం అదిరిపోయింది. ప్రీలుక్‌లో స్టైలిష్‌గా మెడ మీద రూపాయి నాణెం టాటూతో క‌నిపించిన మ‌హేశ్ ఈ సారి రూపాయి బిళ్ళను ఎగ‌రేస్తూ మ్యాజిక్ చేశారు. దీంతో బ‌ర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయిందంటూ అభిమానులు పండ‌గ చేసుకుంటున్నారు. కానీ మ‌హేశ్ పూర్తి లుక్ మాత్రం చూపించ‌నేలేదు. (బర్త్‌డే సందర్భంగా ఫ్యాన్స్‌కు మహేష్‌ పిలుపు)

హీరో బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆయ‌న అభిమానులు #HBDMaheshBabuను ట్విట‌ర్‌లో ట్రెండ్ చేస్తున్నారు. ఇక ఈపాటికే సూప‌ర్ స్టార్ కృష్ణ బర్త్‌డే సందర్భంగా ఈ చిత్రం టైటిల్‌ను, మ‌హేశ్ ప్రీలుక్‌ను విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. పూర్తి వినోదాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం ఓ సందేశాన్ని ఇవ్వ‌నుంది. 'గీతా గోవిందం' ఫేమ్‌‌ ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేశ్ బాబు, కీర్తి సురేష్ జంట‌గా మైత్రీ మూవీ మేక‌ర్స్, 14 రీల్స్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. (ఆ విషయంలో తగ్గేది లేదన్న స్వీటీ )

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా