Komalee Prasad: హీరోయిన్‌ బర్త్‌డే.. శశివదనే ఫస్ట్‌ లుక్‌ వచ్చేసింది

24 Aug, 2022 21:57 IST|Sakshi

యువ కథానాయకుడు రక్షిత్ అట్లూరి హీరోగా, కోమలీ ప్రసాద్ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం శశివదనే. ఆర్‌ఎక్స్‌ 100 రాంకీ, నటుడు రఘు కుంచె, కన్నడ నటుడు దీపక్ ప్రిన్స్‌ నటీనటులుగా సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ రోజు చిత్ర హీరోయిన్ కోమలి ప్రసాద్ బర్త్ డే ను పురస్కరించుకొని చిత్ర యూనిట్ విడుదల చేసిన "శశివదనే" ఫస్ట్ లుక్ అందరినీ కట్టి పడేస్తోంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అహితేజ బెల్లంకొండ మాట్లాడుతూ.. మా చిత్ర హీరోయిన్ కోమలీ ప్రసాద్ బర్త్ డే సందర్బంగా మా చిత్ర యూనిట్ తరుపున తనకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నాం. ‘పలాస 1978’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన హీరో రక్షిత్ అట్లూరి చాలా చక్కని నటన కనపరచ్చాడు. హీరోయిన్ కూడా బాగా నటించింది. ఇండస్ట్రీలో ప్రస్తుతం షూటింగ్ నిలిపివేత కారణంగా ఈ చిత్రం కూడా షూటింగ్ నిలుపుదల చేశాం. సెప్టెంబర్ 1 నుంచి షూటింగ్స్ ప్రారంభం అవుతున్న సందర్బంగా ఈ చిత్రానికి సంబంధించి మిగిలి వున్న 10 రోజుల షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేయడానికి సన్నాహాలు  చేస్తున్నాము. నవంబర్‌లో సినిమా రిలీజ్‌ చేస్తాం' అన్నారు.

చదవండి: ఓటీటీలో రాజ్‌కుమార్‌ రావు హిట్‌, స్ట్రీమింగ్‌ అయ్యేది అప్పుడే!
ప్రభాస్‌ కొత్త సినిమా.. ఆ డైరెక్టర్‌ వద్దే వద్దంటూ ఫ్యాన్స్‌ రచ్చ రచ్చ!

మరిన్ని వార్తలు