అవినీతి అంతు చూడటానికి మళ్లీ వస్తున్న సత్యమేవ జయతే

20 Oct, 2020 12:01 IST|Sakshi

సత్యమేవ జయతే 2 షూటింగ్‌కు అన్ని సిద్దమయ్యాయి. జాన్‌ అబ్రహమ్‌, దివ్య కోశ్లా కుమార్‌ కలిసి నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ మంగళవారం లక్నోలో మంగళవారం మొదలయ్యింది. ఈ సినిమా నిర్మాణం పూర్తయ్యే సరికి వచ్చే ఏడాది జనవరి వరకు పట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం లక్నోలో ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్‌ వచ్చే ఏడాది ముంబాయిలో జరగనుంది. ఈ సినిమాను మిలప్‌ జవేరీ డైరెక్ట్‌ చేస్తున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది మే 12న ఈ సినిమా విడుదల కానుంది. ఈ విషయాలను ప్రముఖ సినీ విమర్శకులు తరణ్‌ ఆదర్శ్‌ తన ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. అవినీతిని రూపుమాపే బ్యాక్‌ డ్రాప్‌లో ఈ సినిమా పార్ట్‌ 1 రిలీజ్‌ అయ్యి సూపర్‌ సక్సెస్‌ అయిన సంగతి తెలిసిందే.  

చదవండి: ఆ డాక్ట‌ర్ ద‌గ్గ‌ర డ్యాన్స్ నేర్చుకుంటా: హృతిక్

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా