సంక్రాంతికి ముందే సింగర్‌ సునీత పెళ్లి!

26 Dec, 2020 16:21 IST|Sakshi

సునీత పెళ్లి డేట్‌ ఫిక్స్‌..

తన గాత్ర మాధుర్యంతో అభిమానులను ఓలలాడించే సింగర్‌ సునీత వైవాహిక జీవితం గురించి ఎన్నో పుకార్లు వచ్చాయి. కానీ ఏనాడూ ఆమె వాటిని పట్టించుకోలేరు. అయితే ఓ షోలో మాత్రం తన భర్త వల్ల ఇబ్బందిపడుతున్న విషయాన్ని బయట పెట్టారు. పిల్లలను తనే పెంచి పోషిస్తున్నట్లు తెలిపారు. ఒంటరిగానే జీవితాన్ని నెట్టుకొస్తున్నట్లు స్పష్టం చేశారు. దీంతో ఆమె వైవాహిక జీవితం గురించి వస్తున్న రూమర్లకు పుల్‌స్టాప్‌ పెట్టేశారు. కాగా సింగిల్‌ పేరెంట్‌గా పిల్లల బాధ్యత చూసుకుంటున్న ఆమె ఇటీవలే రెండో పెళ్లికి సిద్ధమయ్యారు. (చదవండి: సునీత ప్రీ వెడ్డింగ్‌.. హాజరైన రేణు దేశాయ్‌)

(సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమైన ఇన్విటేషన్‌ కార్డు)

మ్యాంగో మీడియా గ్రూప్‌ హెడ్‌ రామ్‌ వీరపనేనితో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. జనవరి 9న సునీత, రామ్‌ల పెళ్లి ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం. దీంతో ఈ జంట సంక్రాంతికి ముందే ఏడడుగులు వేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వివాహ కార్యక్రమానికి కేవలం ఇరు కుటుంబాలు, బంధుమిత్రులు మాత్రమే హాజరు కాబోతున్నారట. అందువల్ల సినీ సెలబ్రిటీల కోసం సునీత నేడు ప్రీవెడ్డింగ్‌ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారని టాక్‌ వినిపిస్తోంది. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రిక నెట్టింట చక్కర్లు కొడుతోంది. కాగా ఇటీవలే గచ్చిబౌలిలోని ఓ స్టార్‌ హోటల్‌లో సునీత-రామ్‌ ఓ స్పెషల్‌ పార్టీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనికి టాలీవుడ్‌ నటీనటులతో పాటు టాప్‌ సింగర్స్‌ కూడా హాజరయ్యారు. సునీతకు కాబోయే భర్త రామ్‌కు నితిన్ కూడా అత్యంత సన్నిహితుడు కావడంతో దగ్గరుండి ఈ వేడుకను జరిపించినట్లు సమాచారం. (చదవండి: పెళ్లికి సిద్ధమవ్వనున్న మరో బాలీవుడ్‌ జంట)

మరిన్ని వార్తలు