నా పాత్రను అందరు ప్రశంసిస్తున్నారు: ‘సీతారామం’ నటుడు

19 Aug, 2022 09:00 IST|Sakshi

‘‘సీతారామం’ చిత్రంలో ఇంటరాగేషన్‌ అధికారి పాత్ర లభించడం హ్యాపీ. ఇది చిన్న పాత్రే అయినా రష్మిక-సుమంత్‌ల కాంబినేషన్‌లో చేసిన కీలక సన్నివేశం కావడంతో నా పాత్రను అందరూ ప్రశంసిస్తుండటం ఓ కొత్త ఎనర్జీ ఇస్తోంది’’ అని నటుడు మధు నంబియార్‌ అన్నారు. దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సీతారామం’. సి. అశ్వనీదత్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 5న విడుదలైంది.

చదవండి: Anasuya Bharadwaj: ఇక్కడ గిల్లితే గిల్లించుకోవాలి: అనసూయ సంచలన వ్యాఖ్యలు

ఈ చిత్రంలో ఇంటరాగేషన్‌ అధికారి పాత్ర చేసిన మధు నంబియార్‌ మాట్లాడుతూ..‘‘ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో ఉద్యోగం చేసి వచ్చాక నటుడిగా మారాను. ‘సర్కారువారి పాట, ‘గంధర్వ, ‘దర్జా’.. ఇలా 20 చిత్రాల్లో చేశాను. ‘సీతారామం’లో చాన్స్‌ ఇచ్చిన నిర్మాతలు అశ్వనీదత్, స్వప్నదత్, ప్రియాంక దత్‌గార్లకు, హను రాఘవపూడికి, రవితేజ చెరుకూరికి థ్యాంక్స్‌. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ ‘ఖుషీ’, నందమూరి చైతన్య కృష్ణ చిత్రాలతో పాటు మరో నాలుగు సినిమాల్లో, ఓ వెబ్‌ సిరీస్‌లో చేస్తున్నాను. విలక్షణమైన నటుడు అని ప్రేక్షకులతో, క్రమశిక్షణ కలిగిన యాక్టర్‌ అని పరిశ్రమతో అనిపించు కోవాలన్నదే నా లక్ష్యం’’ అన్నారు. 

మరిన్ని వార్తలు