ముద్దు వద్దు.. ఆ హీరోలతో మాత్రమే నటిస్తా: స్టార్‌ హీరోయిన్ల డిమాండ్‌

30 Aug, 2022 15:54 IST|Sakshi

క్రియేటివ్‌ ఫీల్డ్‌లోని క్రేజీనెస్‌ ఎంత హైలో ఉంటుందో.. ఆ రంగాన్ని ఏలుతున్న సెలెబ్రిటీల డిమాండ్స్‌ కూడా అంతే హెచ్చుగా ఉంటాయి. స్క్రీన్‌ మీద స్క్రిప్ట్‌ను.. సెట్స్‌లో ప్రొడ్యూసర్స్‌నూ అంతే బ్యాలెన్స్‌డ్‌గా డిమాండ్‌ చేస్తూంటారు. ఆ జాబితాలో సోనాక్షీ సిన్హా, కరీనా కపూర్‌ ఉన్నారు.. 

దబాంగ్‌ నాయిక సోనాక్షీ సిన్హా.. వైవిధ్యమైన పాత్రలు పోషించి మంచి నటిగా పేరు తెచ్చుకుంది. తాను సినిమాల్లోకి వచ్చేముందే ఓ నిర్ణయం తీసుకుందట.. ఎంత అద్భుతమైన సినిమా అవనీ.. ఎంతలా స్క్రిప్ట్‌ డిమాండ్‌ చేయనీ.. ముద్దు సన్నివేశంలో నటించకూడదని. తన దగ్గరకు సినిమా ఆఫర్లతో వచ్చిన నిర్మాత, దర్శకులు అందరికీ ఆ నిర్ణయాన్ని చెప్పి.. ముద్దు సన్నివేశాలు లేకుండా ముందే జాగ్రత్తపడుతుందట. ఇప్పటి వరకైతే ఇలా సాగుతోంది.. మున్ముందు ముద్దు డిమాండ్‌ చేస్తే సినిమా వద్దనుకుంటుందో.. తన నిర్ణయాన్ని మూట కడుతుందో తెలీదు అంటారు బాలీవుడ్‌ వర్గీయులు.

రాజ్‌కపూర్‌ మనవరాలు అనే ప్రివిలేజ్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టినా.. తన నటనాకౌశలాన్ని నిరూపించుకుంటూ కొనసాగుతున్న నటి కరీనా కపూర్‌. తమ సినిమాల్లో కథానాయికగా కరీనాయే కావాలి అని హీరోలు పట్టుబట్టే స్థాయికి రాగానే తానూ ఓ డిమాండ్‌ లిస్ట్‌ను ప్రొడ్యూసర్స్‌కు పంపడం మొదలుపెట్టింది కరీనా.

‘ఏ గ్రేడ్‌ ఆర్టిస్ట్‌ల సరసనే నటిస్తా.. బి గ్రేడ్‌ ఆర్టిస్ట్‌ల సరసన నటించను. సో నన్ను తమ సినిమాల్లో హీరోయిన్‌గా కావాలి అనుకుంటున్న హీరోల రేంజ్‌ చూసుకున్నాకే నాకు చెప్పండి’ అంటూ. దాంతో మంచి మంచి సినిమాలెన్నింటిలోనో నటించే చాన్స్‌ను కోల్పోయిందట కరీనా. అయినా నో రిగ్రెట్స్‌.. గ్రేడ్‌ ఓన్లీ మ్యాటర్స్‌ అంటూ ముందుకెళ్లిపోతోంది ఇప్పటికీ! 

చదవండి: 
ఈ వారం ఓటీటీ, థియేటర్లో సందడి చేసే చిత్రాలివే

మా నాన్న కల నిజం అయినందుకు హ్యాపీ: కేతికా శర్మ

మరిన్ని వార్తలు