‘బంగార్రాజు’తో జతకట్టనున్న బాలీవుడ్‌ భామ!

7 May, 2021 14:23 IST|Sakshi

కింగ్‌ నాగార్జున నటించిన ‘సోగ్గాడే చిన్నినాయన’కు సీక్వెల్‌లో బంగార్రాజు మూవీ వస్తోన్న సంగతి తెలిసిందే. 2015లో విడుదలై ఈ సినిమా సూపర్‌ హిట్‌ అందుకుంది. కింగ్‌ నాగార్జున డబుల్‌ రోల్‌ పోషించిన ఈ చిత్రం ఎంతటి ప్రేక్షక ఆదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇందులో బంగార్రాజు పాత్రకు విశేష స్పందన వచ్చింది. దీంతో ఈ ప్రాత పేరు మీద సీక్వెల్‌కు ప్లాన్‌ చేస్తున్నట్లు గతంలోనే ప్రకటించిన దర్శకుడు ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో తాజాగా దీనికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

కాగా ఇటీవల స్క్రిప్ట్‌ను పూర్తి చేసిన దర్శకుడ అందులో కొన్ని మార్పులు చేసి కథ ఫైనల్‌ చేశాడట. ఇదిలా ఉండగా నాగార్జున సరసన బాలీవుడ్‌ భామ సోనాక్షి సిన్షాను కథానాయికగా తీసుకొవాలనుకుంటున్నారని, దీనిపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లు టాలీవుడ్‌లో వినికిడి. ఒకవేళ అంతా ఒకే అయితే ఇందులో బంగార్రాజుతో సోనాక్షి సిన్హా ఆడిపాడనుందట. దీంతో పాటు ఫీమేల్‌ లీడ్‌ రోల్‌ కాకపోయిన, ఓ స్పెషల్‌ రోల్‌ కోసమైన సోనాక్షిని సంప్రదించాలని డైరెక్ట్‌ భావిస్తున్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని అనుకున్నట్లుగానే జూన్‌, జూలేలో షూటింగ్‌ ప్రారంభించి, వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తిసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. 

చదవండి: 
ఒక్క నెలలోనే 6కేజీలు తగ్గిన పాయల్‌.. ఏం చేసిందంటే..
అరియానా అసలు పేరు తెలుసా? నాగార్జునకు కూడా చెప్పలేదు!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు