సోనూసూద్‌ కోసం వందల కిలోమీటర్ల నుంచి వచ్చి..

4 Nov, 2020 16:09 IST|Sakshi

వెండితెరపై విలన్‌గా ఆకట్టుకున్న సోనూసూద్‌ కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ‘రియల్‌ హీరో’ అయిపోయాడు. ఎక్కడ ఏ ఆపద ఉన్నా.. నేనున్నాను అంటూ ముందుకు వచ్చి సాయం అందిస్తున్నాడు. అనేక మంది వలస కార్మికులను తమ గమ్యస్థానాలకు చేర్చి పెద్దమనసును చాటుకున్నాడు. విదేశాల్లోని విద్యార్థుల కోసం ప్రత్యేకంగా విమానాన్ని వేసి, కోవిడ్‌ సంక్షోభంతో ఆపదలో ఉన్న అనేక మందిని ఆదుకొని ప్రజల మనస్సుల్లో ‘రియల్‌ హీరో’గా నిలిచాడు. ఫలానా చోట.. ఫలానా సమస్య ఉందన్న విషయం తన దృష్టికి వస్తే చాలు.. వెంటనే తనకు చేతనైనా సాయం అందిస్తూ తన ఊదారతను చాటుకుంటున్నాడు.

ఇక అడిగిన వేంటనే సాయం అందిస్తుండటంతో అనేక మంది తమ బాధలను సోనూసూద్‌కు విన్నవించుకోవడం మొదలెట్టారు. ఆయన ఎక్కడ ఉన్నా.. అక్కడి వెళ్లి తమ సమస్యలను విన్నవించి సాయం చేయమని కోరుతున్నారు. షూటింగ్‌లతో బిజీ బిజీగా ఉన్నప్పటికీ.. తన కోసం వచ్చిన ప్రతి ఒక్కరిని సోనూసూద్‌ కలుసుకొని వారి సమస్యలను ఓపికగా విని పరిష్కరిస్తున్నాడు.

తాజాగా షూటింగ్‌ నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చిన సోనూసూద్‌ను కలిసేందుకు కొన్ని వందల కిలోమీటర్ల నుంచి ప్రజలు తరలి వచ్చారు. వారందరితో సోనూ సమావేశమై ఓపికగా సమస్యలను అడిగితెలుసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. వీడియోలో, సోనూ.. తన దగ్గరకు వచ్చిన ప్రజల సమస్యలను వింటూ వారితో ఆప్యాయంగా మాట్లాడటం కనిపిస్తుంది.సాయం పొందినవారు కూడా సోనూను కలుసుకొని కృతజ్ఞతలు చెబుతున్నారు ‘ చాలా మంది కొన్ని వందల కిలోమీటర్లు దూరం నుంచి సోనూసూద్‌ను కలిసేందుకు వచ్చారు. ఆయన షూటింగ్‌లో బిజీగా ఉన్నప్పటికీ ఓపికితో వారి సమస్యలు విని, పరిష్కారం చూపారు’ అంటూ రమేష్‌ బాల అనే వ్యక్తి ట్వీట్‌ చేశాడు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియోపై సోనూసూద్‌ స్పందించాడు. ‘  ప్రజలకు దగ్గరవ్వడానికి ఆ దేవుడు కొన్ని కొన్ని సార్లు మీలాంటి వాళ్లను ఉత్ప్రేరకంగా ఎన్నకుంటారు. మీ ప్రోత్సాహకరమైన మాటలకు ధన్యవాదాలు రమేష్‌’ అంటూ ట్వీట్‌ చేశాడు. 

మరిన్ని వార్తలు