ఇంకా వెంటిలేట‌ర్‌పైనే ఎస్పీ బాలు

8 Sep, 2020 19:21 IST|Sakshi

చెన్నై: కొద్ది రోజులుగా క‌రోనాతో పోరాడుతున్న గాయ‌కుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యానికి సోమ‌వారం నెగెటివ్ వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని వైద్యులు వెల్ల‌డించారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం హెల్త్ బులెటిన్ విడుద‌ల చేశారు. ఎస్పీ బాలు చికిత్స‌కు స్పందిస్తున్నార‌ని తెలిపారు. వెంటిలేట‌ర్‌, ఎక్మో సాయంతో చికిత్స అందిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. త్వరలోనే ఆయనకు వెంటిలేటర్‌ తీసేయాలని వైద్యులు భావిస్తున్న‌ట్లు ఎస్పీ చ‌ర‌ణ్ తెలిపారు. కాగా వారాంతంలో ఎస్పీ బాలు దంపతులు పెళ్లి రోజును కూడా జ‌రుపుకున్నారు. బాలు కోలుకోవ‌డం ప‌ట్ల ఆయ‌న అభిమానులు, సినీ ప్ర‌ముఖులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. (చ‌ద‌వండి: డెవిల్స్‌ ఎట్‌ వర్క్‌)

ఇదిలా ఉండగా ఎస్పీ బాలు ఆగస్టు 5న కరోనాతో చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొన్నిరోజులకే పరిస్థితి విషమించడంతో ఐసీయూకి తరలించి వెంటిలేటర్ అమర్చారు. తర్వాత ఆయనకు ఎక్మో సాయం అందిస్తూ వచ్చారు. ప్రస్తుతం ఆయన పూర్తిగా స్పృహలోనే ఉన్నారని ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. ఊపిరితిత్తులు కూడా మెరుగుపడినట్లు తెలుస్తోంది. (చ‌ద‌వండి: నాన్న గారికి కరోనా నెగిటివ్‌: ఎస్పీ చరణ్‌)

మరిన్ని వార్తలు