హువావే కిడ్స్  ఫ్రెండ్లీ టాబ్లెట్‌ : తక్కువ ధరలో

8 Sep, 2020 19:21 IST|Sakshi

హువావే  మ్యాట్ ప్యాడ్ టీ 8 

వైఫై వేరియెంట్ ధ‌ర రూ.9,999

ఎల్‌టీఈ వేరియెంట్ ధ‌ర రూ.10,999 

ప్రీ ఆర్డర్ లో వెయ్యి రూపాయలు తగ్గింపు

సాక్షి, ముంబై : చైనా టెక్ కంపెనీ హువావే కొత్త ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌ను లాంచ్ చేసింది. మ్యాట్ ప్యాడ్  టీ8 పేరుతో దీన్ని భారత మార్కెట్లో విడుదల చేసింది. ప్రధానంగా  కరోనా కాలంలో ఆన్ లైన్  క్లాసుల కోసం కంప్యూటింగ్ పరికరాన్ని తీసుకొచ్చింది.  కొనుగోలుదారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులే లక్ష్యంగా ఈ ట్యాబ్‌ను  ఆవిష్కరించింది. 

రికార్డర్, కెమెరా, మల్టీమీడియా కిడ్స్ పెయింటింగ్ , పేస్ అన్ లాక్ లాంటి ఫీచర్లతో  ఇది కిడ్స్  ఫ్రెండ్లీ టాబ్లెట్‌గా ఉంటుందని కంపెనీ వెల్లడించింది. అలాగే ఎక్కువ కాలం పాటు టాబ్లెట్‌ను ఉపయోగిస్తున్నట్లయితే పిల్లల భంగిమను సరిదిద్దేలా హువావే హెచ్చరిక కూడా ఇస్తుందని తెలిపింది. దీంతోపాటు టైమర్ మరియు మల్టీ లేయర్డ్ కంటి రక్షణ ఫీచర్ కూడా  ఉందని కంపెనీ పేర్కొంది.12 గంటల బ్యాటరీ బ్యాకప్ ఉంటుందని వెల్లడించింది. అన్ని వైపులా పెద్ద బెజెల్స్‌తో వైఫై, ఎల్‌టీఈ రెండు వెర్షన్లలో లభ్యం.

హువావే మ్యాట్ ప్యాడ్ టీ8 స్పెసిఫికేష‌న్లు
8 ఇంచుల హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే
1280 x 800 పిక్సెల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
ఆండ్రాయిడ్ 10 ఓఎస్
ఆక్టాకోర్ మీడియాటెక్ ఎంటీ8768 ప్రాసెస‌ర్‌
2జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్
512 జీబీ విస్తరించుకునే అవకాశం.
5 ఎంపీ రియర్ కెమెరా
2 ఎంపీ ఫ్రంట్ కెమెరాలు, 
5100 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్

హువావే మ్యాట్‌ప్యాడ్ టీ8 ధర, లభ్యత
వైఫై వేరియెంట్ ధ‌ర రూ.9,999
ఎల్‌టీఈ వేరియెంట్ ధ‌ర రూ.10,999 
సెప్టెంబ‌ర్ 14 వరకు  ఫ్లిప్‌కార్ట్‌లో  ప్రీ-ఆర్డర్‌లకు అందుబాటులో ఉంటుంది. అంతేకాదు ప్రీ-ఆర్డర్ వ్యవధిలో ఎల్‌టీఈ వేరియంట్‌పై వెయ్యి రూపాయల తగ్గింపును అందిస్తోంది.  సెప్టెంబ‌ర్ 15  నుంచి  కొనుగోలుకు లభ్యం.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా