ఖరీదైన అపార్ట్‌మెంట్‌ కొన్న సన్నీలియోన్‌.. ధర ఎంతంటే?

9 Apr, 2021 15:39 IST|Sakshi

ముంబైలో : బాలీవుడ్‌ నటి సన్నీలియోన్‌కు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ముంబైలోని అంధేరిలో సన్నీలియోన్‌ ఇటీవలె ఓ ఇంటిని కొనుగోలు చేసింది. 4,365 చ‌ద‌ర‌పు అడుగులు ఉన్న ఈ 5బీహెచ్‌కే అపార్ట్‌మెంట్‌ ధరకు సంబంధించిన గత కొన్ని రోజులుగా చర్చ నడుస్తుంది. 16 కోట్లు ఖర్చుపెట్టి సన్నీలియోన్‌ ఈ ఇంటికి కొనుగోలు చేసినట్లు సమాచారం. అత్యాధునికంగా ఈ ఇంటి నిర్మాణం ఉందని, దాదాపు 3 కార్లు పార్కింగ్‌ కెపాసిటీ ఉందని తెలుస్తుంది.

మరో ఆసక్తికర విషయం ఏమిటంటే...ఈ ఇంటిని సన్నీలియోన్‌ అసలు పేరు క‌ర‌ణ్‌జిత్ కౌర్ వోహ్రా పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయించినట్లు సమాచారం. బిగ్‌బాస్‌ సీజన్‌ 5 రియాలిటీ షోతో గుర్తింపు తెచ్చుకున్న సన్నీలియోన్‌..జిస్మ్‌2 చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఆమె చేసిన రాగిణి ఎంఎంఎస్‌2, వన్‌ నైట్‌ స్టాండ్‌ చిత్రాలతో పాపులారిటీ సంపాదించుకుంది.  ప్రస్తుతం ఆమె విక్రమ్‌ భట్‌ దర్వకత్వంలో అనామిక అనే వెబ్‌సిరీస్‌లో నటిస్తుంది. 

చదవండి : రోడ్డు మీద మహిళ ఇబ్బందులు: సన్నీలియోన్‌ భర్త సాయం
అదే ప్రశ్న నేను అడిగితే ముఖం ఎక్కడ పెట్టుకుంటావ్‌?

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు