రంగరాయ శక్తివేల్‌ నాయకర్‌.. థగ్‌లైఫ్‌

7 Nov, 2023 05:43 IST|Sakshi

‘నాయగన్‌ ’(1987) చిత్రం తర్వాత హీరో కమల్‌హాసన్, దర్శకుడు మణిరత్నం కాంబినేషన్‌లో రూ΄÷ందుతున్న తాజా చిత్రానికి ‘థగ్‌ లైఫ్‌’ టైటిల్‌ని ఖరారు చేసి, టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ వీడియోను సోమవారం రిలీజ్‌ చేశారు మేకర్స్‌. అలాగే ఈ చిత్రంలో త్రిష, దుల్కర్‌ సల్మాన్, ‘జయం’ రవి కీలక ΄ాత్రలు ΄ోషించనున్నట్లు  కూడా వెల్లడించారు. ‘రంగరాయ శక్తివేల్‌ నాయకర్‌.. నాది కాయల్‌ పట్టినమ్‌’, ‘రంగరాయ శక్తివేల్‌ నాయకర్‌ అంటే క్రిమినల్, గూండా, యాకుజా.

యాకుజా అంటే జపనీస్‌లో గ్యాంగ్‌స్టర్‌ అని అర్థం’, ‘చావు నా కోసం ఎదురుచూడటం ఇదేం తొలిసారి కాదు. చివరిసారి కూడా కాదు’, ‘నా పేరు రంగరాయ శక్తివేల్‌ నాయకర్‌.. మర్చి΄ోవద్దు’ అని కమల్‌హాసన్‌ చెప్పే డైలాగ్స్‌ ‘థగ్స్‌ లైఫ్‌’ టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ వీడియోలో ఉన్నాయి. కమల్‌హాసన్, మణిరత్నం, ఆర్‌ మహేంద్రన్, శివ అనంత్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నేడు కమల్‌ బర్త్‌ డే సందర్భంగా ‘థగ్‌ లైఫ్‌’కి సంబంధించిన విశేషాలను సోమవారం వెల్లడించారు మేకర్స్‌. ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్‌ రెహమాన్, కెమెరా: రవి కె.చంద్రన్‌.

మరిన్ని వార్తలు