శాంత్‌ కేసు సాక్ష్యులకు భద్రత కల్పించాలి: సుశాంత్‌ కజిన్‌

18 Aug, 2020 14:41 IST|Sakshi

సాక్షి, ముంబై: బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసులో రోజు రోజుకు కీలక ఆధారాలు బయటపడుతున్నాయి. కేసుకు సంబంధించిన సమాచారం ఇవ్వడానికి ఒక్కక్కరూ బయటకు వస్తున్నారు. దీంతో సుశాంత్‌ సింగ్‌ కజిన్‌ సోదరుడు బీజేపీ ఎమ్మెల్యే నీరజ్‌ కుమార్‌ సింగ్‌ బబ్లు ఈ కేసులో నిజాలు బయటపెట్టేందుకు చాలామంది సాక్ష్యులు ఉన్నారని, వారు ప్రాణ భయంతో బయటకు రావడం లేదన్నారు. కాబట్టి ఇప్పటికే ముందుకు వచ్చిన సాక్ష్యులకు భద్రత కల్పించాలన్నారు. ఈ సందర్భంగా నీరజ్‌ కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ.. “ప్రతి రోజు సుశాంత్ కేసులో కొత్త సాక్షులు బయటకు వస్తున్నారు. కొత్త వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. అలాంటి వారు తమ సమాచారాన్ని కూడా సీబీఐతో పంచుకోవాలనుకుంటున్నారు. అయితే ఈ సాక్ష్యులంతా  అభద్రత భావానికి గురవుతున్నారు. ఎందుకంటే ఎక్కడా నిజాలు చెబితే వారిని చంపేస్తారోమోనన్న భయం వారిలో ఉందని పేర్కొన్నారు. (చదవండి: అప్పుడే అందరికీ ప్రశాంతత: సుశాంత్‌ సోదరి)

అలాంటి వారి సాక్ష్యాలు సీబీఐ దర్యాప్తుకు కీలకం కావచ్చని, అటువంటి సాక్ష్యాధారాలను కొన్ని అతీత శక్తుల వల్ల కొల్పోతున్నామని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ సాక్షులకు భద్రత ఎందుకు కల్పించలేదని ఆయన ముంబై పోలీసులను ప్రశ్నించారు. ముంబై పోలీసులు సాక్షులకు తగిన భద్రత కల్పించాలని, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో సాక్ష్యాధారాలు నాశనం కాకుండా చూసుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్‌ చేశారు. ‘సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో ముందుకు వచ్చిన సాక్షులందరికీ తక్షణ రక్షణ కల్పించాలని, సాక్ష్యాలు దెబ్బతినకుండా చూసుకోవాలని ముంబై పోలీసులను నేను కోరుతున్నాను. తద్వారా సీబీఐ దర్యాప్తు ప్రారంభించినప్పుడు, సాక్షులు, సాక్ష్యాలను ముందు సమర్పించవచ్చు. సాక్షికి ఏదైనా హాని జరిగితే లేదా సాక్ష్యాలను దెబ్బతీస్తే, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో దర్యాప్తు ప్రభావితమవుతుంది’ అని నీరజ్‌ కుమార్‌ పేర్కొన్నారు.
(చదవండి: ‘సుశాంత్‌ సినీ జీవితాన్ని అంతం చేయాలని చుశారు’)

మరిన్ని వార్తలు