Bigg Boss OTT Date: తెలుగు 'బిగ్​బాస్​ ఓటీటీ' వచ్చేది అప్పుడేనా ?

5 Feb, 2022 08:10 IST|Sakshi

Telugu Bigg Boss OTT Show Will Telecast In February: తెలుగు బుల్లితెరపై బిగ్‌బాస్‌ రియాల్టీ షోకి ఉన్న క్రేజ్‌ గురించి అందరికి తెలిసిందే. సీజన్‌.. సీజన్‌కి ఈ షోకి ఆదరణ పెరిగిపోతుంది. ఇప్పటికే తెలుగులో ఐదు సీజన్స్‌ పూర్తి చేసుకున్న ఈ బిగ్‌ రియాల్టీ షో.. ఇప్పుడు డిస్నీ ప్లస్​ హాట్​స్టార్​ ఓటీటీ వేదికగా అలరించనుంది. ఈ విషయాన్ని బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ హోస్ట్‌ కింగ్‌ నాగార్జున స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ షోకి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు టాలీవుడ్​ సినీ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. 

ఈ కార్యక్రమానికి సెలెక్ట్​ అయిన కంటెస్టెంట్లు ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కొన్ని రోజులు క్వారంటైన్​లో ఉంటారని తెలుస్తోంది. అలాగే ఈ నెల 27 నుంచి బిగ్​బాస్ ఓటీటీ షో ప్రసారమయ్యే అవకాశాలున్నాయని సమాచారం. అంతేకాకుండా ఫిబ్రవరి రెండోవారంలో ఈ షో లోగో, ప్రోమో విడుదల కానున్నాయట. బిగ్​బాస్​ గత సీజన్​లలో పాల్గొన్న ముమైత్​ ఖాన్​, ఆదర్శ్​, తనీశ్​, ధన్​రాజ్​తోపాటు యాంకర్​ వర్షిణి, యాంకర్​ శివ, డ్యాన్స్‌ షో ‘ఢీ-10’ విజేత రాజు, టిక్‌టాక్‌ స్టార్‌ దుర్గారావు, ‘సాఫ్ట్‌వేర్‌ డెవలపర్స్‌’వెబ్‌ సిరీస్‌ ఫేమ్‌ వైష్ణవి, పార్టిస్​పేట్​ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

మరిన్ని వార్తలు