Thop TV Owner Arrested: ఓటీటీ కంటెంట్‌ను కాపీ కొట్టి, ఫ్రీగా విడుదల

14 Jul, 2021 17:05 IST|Sakshi

ఓటీటీ కంటెంట్‌ను కాపీ కొట్టి, ఫ్రీగా విడుదల చేస్తున్న తోప్‌ టీవీ యాప్‌ నిర్వాహకుడు, ఐటీ ఇంజనీర్‌ సతీశ్‌ వెంకట్వేర్లును మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్‌ చేశారు. హైదరాబాద్‌కు చెందిన సతీష్‌, అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌, ఆహా, హాట్‌స్టార్‌ తదితర ఓటీటీల కంటెంట్‌ను దొంగలిస్తూ..  గత రెండేళ్లుగా తోప్‌ టీవీ ద్వారా ఫ్రీగా విడుదల చేస్తున్నాడు. వాయ్‌ కామ్‌ 18 మీడియా ఫిర్యాదు చేయడంతో మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేసుకొని, గుర్రంగూడలో నివసిస్తున్న సతీష్‌ని అరెస్ట్‌ చేశారు. అనంతరం ముంబై కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. 

మరిన్ని వార్తలు