టీవీ నటుడికి షాకిచ్చిన ఫ్లిప్‌కార్ట్‌.. ఇయర్‌ఫోన్స్ ఆర్డర్ చేస్తే!

16 Oct, 2021 15:54 IST|Sakshi

ఈ కామర్స్‌ విధానానికి అలవాటు పడిన జనాలు అన్నీ ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేస్తున్నారు.. ఈ క్రమంలో కొన్నిసార్లు మనం ఆర్డర్‌ చేసిన వస్తువుకు బదులు వేరే వస్తువు డెలివరీ అవ్వడం సాధారణంగా జరగుతూ ఉంటుంది. అయితే ఏదో ఒక వస్తువు మాత్రం తప్పకుండా వస్తుంది. కానీ ఈసారి డెలివరీ చేసిన దాంట్లో ఏం లేకండా ఏకంగా ఖాళీ డబ్బానే వచ్చింది. ఇలాంటి సంఘటనలు సాధారణ ప్రజలకు మాత్రమే జరుగుతాయనుకుంటే పొరపాటే.. సెలబ్రిటీలు సైతం ఇందుకేం అతీతులు కాదు.
చదవండి: సింఘు సరిహద్దులో వ్యక్తి హత్య: ‘అతను అలాంటివాడు కాదు.. ఆశ చూపి’‘

వివరాల్లోకి వెళితే.. టీవీ నటుడు, అనుపమ ఫేమ్‌ పరాస్‌ కల్వనాత్‌.. ఫ్లిప్‌కార్ట్‌లో నథింగ్‌( ఏమీ లేదు అని అర్థం) అనే బ్రాండ్‌కు చెందిన ఇయర్‌-1 ఇయర్‌ ఫోన్‌ను ఆర్డర్‌ చేశాడు. డెలీవరీ వచ్చాక దాన్ని ఓపెన్‌ చేసి చూసిన నటుడు షాక్‌ కు గురయ్యాడు. ఆయనకు వచ్చిన ఆర్డర్‌లో నిజంగానే ఏం లేదు. ఈ కామర్స్‌ డెలీవరీ తప్పిదాన్ని పరాస్‌ ట్విటర్‌లో పోస్టు చేస్లూ.. ఫ్లిప్‌కార్ట్‌ నుంచి తాను అందుకున్న ఫోటోలను షేర్‌ చేశాడు. ఈ కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ త్వరలో ప్రజల నమ్మకాన్ని కోల్పోతుందనీ, సేవల్లో నాణ్యత తగ్గుతుందనీ కాప్షన్‌ చేశాడు.
చదవండి: అతను కూడా నాలాగే ఆమెను ప్రేమిస్తున్నాడు

ఇక నటుడి ట్వీట్‌పై ఫ్లిప్‌కార్ట్ స్పందించింది. తమ అధికారిక ట్విటర్‌ పేజ్‌ ద్వారా రిప్లై ఇచ్చింది. ‘జరిగిన దానికి చింతిస్తున్నాం. ఆర్డర్‌కి సంబంధించి మీకు ఎదురైన అసౌకర్యాన్ని మేము అర్థం చేసుకున్నాం. మేము మీకు సాయం చేసేందుకే ఉన్నాం. దయచేసి ఆర్డర్ ఐడీని మాకు షేర్ చెయ్యండి. దీని ద్వారా మేము పరిశీలించి సాయం అందిస్తాం.. మీ రెస్పాన్స్ కోసం ఎదురుచూస్తున్నాం.’అని పేర్కొంది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు