‘జాంబీ రెడ్డి’లో అలరించనున్న లహరి షరీ

4 Feb, 2021 19:35 IST|Sakshi

ఇంద్ర సినిమాలో జూనియర్ ఇంద్రసేనా రెడ్డిగా తొడకొట్టిన తేజ సజ్జా హీరోగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న చిత్రం జాంబీ రెడ్డి. ఆనంది, దక్ష నగార్కర్‌ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. యంగ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 5 ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. జాంబీరెడ్డి సినిమాలో లహరి షరీ కీలక పాత్రలో కనిపించనున్నారు. బుల్లితెర ద్వారా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన లహరికి ఈ సినిమా మంచి పేరును తెచ్చిపెట్టనుందనడంలో సందేహం లేదు. టీవీ ప్రెజెంటర్‌గా కెరీర్‌ ప్రారంభించిన లహరి పలు ఛానల్లో వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఆ తరువాత తన టాలెంట్‌తో అనేక సినిమాల్లో నటించి ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించింది. 2017లో వచ్చిన అర్జున్‌ రెడ్డి ద్వారా సిల్వర్‌ స్క్రీన్‌‌కు పరిచయమయ్యారు లహరి. అందులో అమాయక నర్సుగా నటించి అందరి మన్ననలు పొందారు. చదవండి: కరోనా నేపథ్యంలో జాంబీ రెడ్డి

తరువాత మళ్లీ రావా (2017 ), పటేల్ సార్‌ (2017), పేపర్ బాయ్ (2018), శ్రీనివాస కళ్యాణం (2018), అజ్ఞాతవాసి(2018) తిప్పర మీసం (2019) సినిమాల్లో ఆకట్టుకున్న లహరి ఇప్పుడు జాంబీ రెడ్డి ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో లహరి షరీ పాత్ర కీలకం కావడంతో ఇది ఆమె కెరీర్‌లో పెద్ద హిట్‌గా నిలవబోతుందనడంలో ఆశ్చర్యం లేదు. కాగా జాంబీ రెడ్డి ట్రైలర్‌ను ఇటీవల ప్రభాస్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే.  ఆపిల్ స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ జాంబీ రెడ్డి సినిమాకు రాజశేఖర్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మార్క్ కే రాబిన్ సంగీతం అందిస్తున్నారు. ఆనందీ, దక్ష నగర్కర్‌, గెటప్‌ శ్రీను, పృథ్వీ, రఘు బాబు, అన్న పూర్ణమ్మ, కిరీటి, హరితేజ, మహేష్‌ విట్ట ఇతర పాత్రల్లో నటించారు. కరోనా వైరస్‌ చుట్టూ తిరిగే ఈ కథను కర్నూలులో తీశారు. మహమ్మారిని కట్టడి చేయడంలో కర్నూలు ప్రజలు ఎలా బయటపడ్డారనేది చిత్రం.

లాహరి షరీ ప్రస్తుతం కన్నడ సినిమా ‘గ్రామ’లో నటిస్తున్నారు.  హేమంత్ కుమార్ రూపొందిస్తున్న ఈ సినిమాలో ఆమె కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాతో తనకు మంచి బ్రేక్‌ వస్తుందని లాహరి షరీ నమ్మకంగా ఉన్నారు. మున్ముందు మరింత బిజీ అవుతానని ఆమె ఆశిస్తున్నారు.

మరిన్ని వార్తలు