జాతీయ అవార్డులు ప్రదానం | Sakshi
Sakshi News home page

జాతీయ అవార్డులు ప్రదానం

Published Sun, Dec 10 2023 11:56 PM

కరపత్రాలు ఆవిష్కరిస్తున్న 
వాసరవేణి పరుశురాం - Sakshi

ఎల్లారెడ్డిపేట/తంగళ్లపల్లి(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన కార్వింగ్‌ కళాకారుడు శ్యామంతుల అనిల్‌, పర్యావరణ ప్రేమికుడు దుంపెన రమేశ్‌, తంగళ్లపల్లి మండలం బస్వాపూర్‌కు చెందిన శ్రీరామోజు వేణుగోపాలాచారి ఆదివారం జాతీయ అవార్డులు అందుకున్నారు. విజయవాడ తెలుగు సాంస్కృతిక బాలోత్సవ భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలుగు–వెలుగు సాహితీ వేదిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈ అవార్డులు అందజేశారు. గత 20 ఏళ్లుగా చిత్రకళారంగంతోపాటు కార్వింగ్‌ కళాకారునిగా రాణిస్తున్న అనిల్‌ను జాతీయ కళారత్న పురస్కారానికి ఎంపిక చేశారు. దుంపెన రమేశ్‌ పుష్కర కాలంగా పర్యావరణ పరిరక్షణకు మొక్కల పంపిణీతో ముందుకెళ్తుండడంతో ఆయన సేవలను సంస్థ గుర్తించింది. బస్వాపూర్‌కు చెందిన వేణుగోపాలాచారి జ్యోతిష్యశాస్త్రంలో చూపిన ప్రతిభను గుర్తించి విశిష్ట జ్యోతిష్యరత్న జాతీయ పురస్కారానికి ఎంపిక చేసింది. అవార్డు ప్రదానోత్సవంలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ ఆచార్య, డాక్టర్‌ వలబోజు మోహన్‌రావు, డాక్టర్‌ రంగిశెట్టి రమేశ్‌రావు, డాక్టర్‌ వంగాల శాంతికృష్ణ ఆచార్య, డాక్టర్‌ వెంపటి శ్రావణి తదితరులు పాల్గొన్నారు.

జనవరిలో అంతర్జాతీయ తెలుగుసభలు

సిరిసిల్లటౌన్‌: ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరంలో జనవరి 5, 6, 7 తేదీల్లో రెండో అంతర్జాతీయ మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలుగు మహాసభల ప్రచార కార్యదర్శి వాసరవేణి పరుశురాం తెలిపారు. ఈమేరకు జిల్లా కేంద్రంలో ఆదివారం కరపత్రాలను ఆవిష్కరించారు. 25 ప్రక్రియలపై సదస్సులు ఉంటాయని తెలి పారు. సిరిసిల్ల సాహితీవేత్తలు జనపాల శంకరయ్య, ముడారి సాయిమహేశ్‌, గుండెల్లి వంశీ తదితరులు పాల్గొన్నారు.

సెల్‌టవర్‌ నిర్మాణం ఆపాలి

గంభీరావుపేట(సిరిసిల్ల): గంభీరావుపేటలోని మూడోవార్డులో ఏర్పాటు చేయదలచిన సెల్‌టవర్‌ నిర్మాణాన్ని వెంటనే ఆపాలని కాలనీవాసులు డిమాండ్‌ చేస్తున్నారు. ఆదివారం సెల్‌టవర్‌ నిర్మాణానికి ఏర్పాట్లు చేయగా.. కాలనీవాసులు నిరసన తెలిపారు. టవర్‌ నుంచి వచ్చే రేడియేషన్‌తో తమకు ప్రమాదం పొంచి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాణాన్ని ఆపకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

వైన్‌షాపు, దాబాను తొలగించాలి

చందుర్తి ఎస్సీకాలనీవాసుల తీర్మానం

చందుర్తి(వేములవాడ): చందుర్తి మండలకేంద్రంలోని ఎన్సీకాలనీలో గల అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట వైన్‌షాపుతోపాటు అనుమతి లేని దాబా హోటళ్లను తొలగించాలని ఆ కాలనీకి చెందిన 62 మంది ఆదివారం ఏకగ్రీవంగా తీర్మానించుకున్నారు. వైన్‌షాపు, అనుమతి దాబాతో అర్ధరాత్రి వరకు మందుబాబులు చేస్తున్న వీరంగంతో ప్రాంతవాసులకు నిద్ర లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా ఇళ్లకు ప్రహరీలు లేవని, మరుగుదొడ్లు లేని ఇళ్లు సైతం ఉన్నాయని.. దీంతో అభద్రతతో కాలం వెల్లదీస్తున్నట్లు పేర్కొన్నారు. ఎస్సీకాలనీ వద్ద ఏర్పాటు చేసిన వైన్‌షాపు, అనుమతిలేని దాబా నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎకై ్సజ్‌ శాఖ అధికారితోపాటు కలెక్టర్‌, ఎస్పీలకి సోమవారం ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

పురస్కారం అందుకుంటున్న వేణుగోపాలాచారి
1/3

పురస్కారం అందుకుంటున్న వేణుగోపాలాచారి

సెల్‌ టవర్‌ నిర్మాణాన్ని 
ఆపాలంటున్న గ్రామస్తులు
2/3

సెల్‌ టవర్‌ నిర్మాణాన్ని ఆపాలంటున్న గ్రామస్తులు

అవార్డులు అందుకున్న అనిల్‌, రమేశ్‌
3/3

అవార్డులు అందుకున్న అనిల్‌, రమేశ్‌

Advertisement
Advertisement