తమిళ స్టార్‌ హీరో సినిమాలో బేబమ్మకు ఛాన్స్!‌

16 Apr, 2021 06:40 IST|Sakshi

ఒక్క ఛాన్స్‌ దక్కాక రెండో అవకాశం వెంటనే రాకపోవచ్చు. ప్రతిభ ఉన్నా ఇంకో ఛాన్స్‌ రావడానికి టైమ్‌ పట్టొచ్చు. వస్తే మాత్రం అదృష్టవంతుల కిందే లెక్క. ఇప్పుడు అందరూ కృతీ శెట్టిని అంటున్న మాట ‘లక్కీ గర్ల్‌’. ‘ఉప్పెన’ సినిమాతో కథానాయికగా పరిచయమై, తనలో మంచి నటి ఉందని నిరూపించుకున్న ఈ బ్యూటీ ఇప్పటికే నాని సరసన ‘శ్యామ్‌ సింగరాయ్‌’, సుధీర్‌బాబుతో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, హీరో రామ్‌ తాజా చిత్రంలోనూ నటిస్తున్నారు.

ఇప్పుడు తమిళ చిత్రసీమ నుంచి ఆమెకు బంపర్‌ ఆఫర్‌ దక్కిందని టాక్‌. మాస్‌ హీరో ధనుష్‌ సరసన కృతి అవకాశం దక్కించుకున్నారట. ధనుష్‌ హీరోగా ‘మారి’, ‘మారి 2’ చిత్రాలకు దర్శకత్వం వహించిన బాలాజీ మోహన్‌ ఈ హీరోతో మరో సినిమా చేయనున్నారు. ఈ సినిమాలోనే కృతి నాయికగా నటించనున్నారని సమాచారం. ధనుష్‌లాంటి హీరోతో తొలి ఎంట్రీ అంటే.. లక్కీయే.
(చదవండి: ఆనందంలో మునిగితేలుతున్న అల్లు శిరీష్‌)

మరిన్ని వార్తలు