నేడే వరుణ్‌-నటాషాల వివాహం

24 Jan, 2021 11:59 IST|Sakshi

ముంబై: మొత్తానికి వాయిదాలు పడుతూ వచ్చిన బాలీవుడ్‌ హీరో వరుణ్ ‌ధావన్‌ పెళ్లి ఎట్టకేలకు నేడు(ఆదివారం) జరగబోతోంది. నెచ్చెలి నటాషా దళాల్‌ చేయి పట్టుకుని ఆమెతో ఏడడుగులు నడవబోతున్నాడు. వీరి దాంపత్య జీవితానికి శుభారంభం పలికేందుకు అలీభాగ్‌లోని ద మాన్షన్‌ హౌస్‌ అంగరంగ వైభవంగా ముస్తాబైంది. కొత్త జంటను ఆశీర్వదించేందుకు బాలీవుడ్‌ సెలబ్రిటీలు శషాంక్‌ ఖైతన్‌, మనీష్‌ మల్హోత్రా, జోవా మొరానీ, డాలీ సిధ్వానీ(రితేష్‌ సిద్వానీ భార్య) శనివారమే పెళ్లి మండపానికి చేరుకున్నారు.

తాజాగా ఈ పెళ్లి గురించి వరుణ్‌ అంకుల్‌, నటుడు అనిల్‌ ధావన్‌ మాట్లాడుతూ.. "మేమంతా చాలా ఎగ్జైట్‌గా ఉన్నాం. ఎందుకంటే మా కుటుంబంలో ఇదే చివరి పెళ్లి. వరుణ్‌ పెద్దన్నయ్య రోహిత్‌కు ఇదివరకే పెళ్లైంది. నా పిల్లలకు, అందులో నా పెద్దకొడుకు సంతానానికి కూడా పెళ్లిళ్లైపోయాయి. అంటే వరుణ్‌ జెనరేషన్‌లో ఇదే ఆఖరి పెళ్లి" అని చెప్పుకొచ్చారు. కాగా గతంలో కూడా వరుణ్‌ పెళ్లి డేటును సైతం ఈయనే లీక్‌ చేశారు. జనవరి 24న వరుణ్‌ ఓ ఇంటివాడు కాబోతున్నాడని, ఆ సమయం కోసం వేచి చూస్తున్నామని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. (చదవండి: 3,4 సార్లు రిజెక్ట్‌ చేసింది: కానీ, నమ్మకంతో..)

ఇక వరుణ్‌ పెళ్లి సందడి విషయానికొస్తే.. శనివారం సంగీత్‌, మెహందీ వేడుకలు జరగ్గా కరణ్‌ జోహార్‌తో కలిసి అలియా భట్‌, జాన్వీకపూర్‌, అర్జున్‌ కపూర్‌ చిందులేశారు. ఈ సంబరాలను రెట్టింపు చేసేందుకు నేడు సల్మాన్‌ఖాన్‌, షారుఖ్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌, శ్రద్ధా కపూర్‌, సాజిద్‌ నదియాద్‌వాలా, జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ వంటి ప్రముఖ సెలబ్రిటీలు ఈ వివాహానికి విచ్చేయనున్నారట. ఇదిలా వుంటే కొత్త పెళ్లికొడుకు వరుణ్‌ చివరిసారిగా తన స్నేహితులతో బ్యాచిలర్‌ పార్టీ జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. (చదవండి: సమ్మర్‌లో బ్యూటిఫుల్‌ ‘లవ్‌స్టోరీ’)

మరిన్ని వార్తలు